AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dilraju: సంక్రాంతి సినిమాల వివాదంపై స్పందించిన దిల్ రాజు.. వచ్చే సినిమాలకి థియేటర్లు దొరకాలంటే నిర్మాతలు ఆలోచించాలి..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం, వెంకటేశ్.. సైంధవ్, రవితేజ.. ఈగల్, తేజ సజ్జా హనుమాన్, నాగార్జున నటిస్తోన్న నా సామిరంగ సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారింది. ఇటు నిర్మాతలెవరూ వెనక్కి తగ్గకపోవడంతో సంక్రాంతి సినిమాల వివాదంపై నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు. ఇటీవల ఫిల్మ్ ఛాంబర్​లో ఆ ఐదు సినిమాల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు.

Dilraju: సంక్రాంతి సినిమాల వివాదంపై స్పందించిన దిల్ రాజు.. వచ్చే సినిమాలకి థియేటర్లు దొరకాలంటే నిర్మాతలు ఆలోచించాలి..
Dil Raju
Rajitha Chanti
|

Updated on: Dec 26, 2023 | 7:57 AM

Share

ఈసారి సంక్రాంతి పండక్కి సినిమాల జాతర ఉండబోతుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ స్టార్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేందుకు ఇప్పుడు సిద్దం కావడం వివాదాస్పదంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం, వెంకటేశ్.. సైంధవ్, రవితేజ.. ఈగల్, తేజ సజ్జా హనుమాన్, నాగార్జున నటిస్తోన్న నా సామిరంగ సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారింది. ఇటు నిర్మాతలెవరూ వెనక్కి తగ్గకపోవడంతో సంక్రాంతి సినిమాల వివాదంపై నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు. ఇటీవల ఫిల్మ్ ఛాంబర్​లో ఆ ఐదు సినిమాల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. సంక్రాంతి రేసు నుంచి రెండు సినిమాలు తప్పుకుంటే థియేటర్లు సర్దుబాటు చేయడం సులభం అవుతుందని అన్నారు. ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నవారికి ఆ తర్వాత సోలో రిలీజ్ డేట్ ఛాంబర్ తరఫున ఇస్తామని ఐదుగురు నిర్మాతలకు చెప్పినట్టు దిల్‌ రాజు వెల్లడించారు. గుంటూరు కారం నిర్మాతలు మినహా మిగతా నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

సంక్రాంతికి ఐదు భారీ చిత్రాలు విడుదలైతే ఏ సినిమాకు న్యాయం జరగదని అన్నారు దిల్ రాజు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఇటీవలే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశామని, సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు దిల్‌ రాజు.

టాలీవుడ్ ఇంటస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించనున్నట్లు నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు తెలిపారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశామని అన్నారు దిల్ రాజు. ఇక త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు తెలిపారు. అలాగే సంక్రాంతి సినిమాల వివాదంపై దిల్ రాజు మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్​లో ఆ ఐదు చిత్రాల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ సంక్రాంతికి గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, హనుమాన్, నా సామిరంగ మొత్తం ఐదు సినిమాలు పోటీపడుతున్నాయి. అయితే ఐదుగురు పెద్ద హీరోల సినిమాలు రావడంతో థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారిందని.. అందుకే ఒకటి రెండు సినిమాలు వాయిదా వేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

గుంటూరు కారం నిర్మాతలు తప్ప మిగతా నలుగురు నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని దిల్‌ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే చిత్ర నిర్మాతకు ఎలాంటి పోటీ లేకుండా సోలో తేదీ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని వివరించారు. సంక్రాంతికి ఐదు చిత్రాలు విడుదలైతే ఏ సినిమాకు న్యాయం జరగదన్న దిల్ రాజు, సినిమా విడుదల తేదీలపై చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదన్నారు.

నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..