Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఈ రోజు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు 167 సినిమాల్లో నటించి మెప్పించారు రజినీకాంత్.
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు 167 సినిమాల్లో నటించి మెప్పించారు రజినీకాంత్. అయితే ఈ రోజు సూపర్ స్టార్ కు చాలా స్పెషల్ డే.. ఆయన అభిమానులకు కూడా చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజు. రజినీకాంత్ కు సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చింది ఈ రోజే. రజినీకాంత్ నటించిన 138 వ సినిమా అన్నామలై . సురేష్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కుష్బూ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా టైటిల్ కార్డు లో సూపర్ స్టార్ రజినీకాంత్ అని వేశారు. ఈ సినిమా 1992లో ఇదే రోజు రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమాకు సరిగ్గా 30 ఏళ్ళు.
ఇక ఇదే టైటిల్ కార్డు ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం సూపర్బ్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు జైలర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో రజినీకాంత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
G.O.A.T Title card ??
Super star @rajinikanth @khushsundar @Suresh_Krissna #Rajinikanth #Annamalai #30YearsOfAnnamalai pic.twitter.com/Djgc0waWSF
— Galatta Media (@galattadotcom) June 27, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..