Rashmika Mandanna: ఆదిలోనే హంసపాదం.. మొదలవకుండానే అటకెక్కిన రష్మిక సినిమా..!
ప్రస్తుతం నేషనల్ క్రష్ గా రాణిస్తోంది అందాల భామ రష్మిక.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ వయ్యారి. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తోంది.

ప్రస్తుతం నేషనల్ క్రష్ గా రాణిస్తోంది అందాల భామ రష్మిక(Rashmika Mandanna).. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ వయ్యారి. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తోంది. ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆవెంటనే పుష్ప సినిమాలో అవకాశం అందుకుంది. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు ఈ అమ్మడు రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది రష్మిక. ప్రస్తుతం విజయ్ సరసన వారసుడు సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు నటిస్తోంది. అయితే ఈ అమ్మడికి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలోనే ఓ ఊహించని షాక్ తగిలిందని తెలుస్తోంది. రష్మిక మందన్న బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తోన్న సినిమాలో ఎంపిక అయ్యింది. అయితే ఈ సినిమా మొదలవక ముందే ఆగిపోయిందని టాక్. ఈ సినిమాకోసం టైగర్ 35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవడానికి సైన్ చేశాడట. అయితే ఇప్పుడు నిర్మాత కరణ్ జోహార్ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరారట. అందుకు టైగర్ నో చెప్పాడని తెలుస్తోంది. రెమ్యునరేషన్లతో కలుపుకుని సినిమా నిర్మాణానికి రూ. 140 కోట్ల వరకు ఖర్చవుతోందట. అయితే టైగర్ రెమ్యునరేషన్ తగ్గించుకోకపోవడంతో ఈ సినిమా అటకెక్కిందని తెలుస్తోంది. దాంతో రష్మిక ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి




