AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత సోషల్‌ మీడియాకు దూరంగా ఉండడానికి కారణం అదేనా.? బీటౌన్‌ ఏమంటోందంటే..

Samantha: పుష్పలో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార సమంత. అప్పటి వరకు ఆచి తూచి సినిమాలు చేస్తూ వచ్చిన సామ్‌ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్...

Samantha: సమంత సోషల్‌ మీడియాకు దూరంగా ఉండడానికి కారణం అదేనా.? బీటౌన్‌ ఏమంటోందంటే..
Samantha
Narender Vaitla
| Edited By: |

Updated on: Aug 30, 2022 | 8:20 PM

Share

Samantha: పుష్పలో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార సమంత. అప్పటి వరకు ఆచి తూచి సినిమాలు చేస్తూ వచ్చిన సామ్‌ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన తర్వాత వరుస ఆఫర్లకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఇక ఓ వైపు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తూ వార్తల్లో నిలిచిన సామ్‌, సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. నిత్యం ఏదో ఒక పోస్ట్‌ చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.

అయితే గత కొన్ని రోజులుగా సమంత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం లేదు. తన వ్యక్తిగత, ప్రొఫెషెనల్ విషయాలను పంచుకునే సామ్‌ ఒక్కసారిగా సైలెంట్‌ అయి పోయింది. దీంతో సమంత ఎందుకు ఇలా మారిందని పెద్ద చర్చ జరిగింది. అయితే సమంత ప్రస్తుతం తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్ కోసం శిక్షణలో ఉన్న కారణంగానే సోషల్‌ మీడియాకు దూరంగా ఉందని తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌లో నటించి మెప్పించిన సామ్‌ ఇప్పుడు అదే టీమ్‌ తెరకెక్కిస్తోన్న మరో వెబ్‌ సిరీస్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌ కోసమే సమంత కసరత్తులు చేస్తోందని, మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటూ బిజీబిజీగా గడుపుతున్న కారణంగానే సామాజిక మాధ్యమాల్లో గతంలో ఉన్నంతగా యాక్టివ్‌గా ఉండడం లేదని బీటౌన్ వర్గాలు అంటున్నాయి. మరి ఫ్యాన్స్‌ నుంచి పెద్ద ఎత్తున వస్తోన్న ప్రశ్నలకు సామ్‌ స్వయంగా సమాధానం చెప్తుందో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం తెలుగులో యశోద, శాకుంతలం, విజయ్‌దేవరకొండతో ఖుషీతో పాటు బాలీవుడ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. వీటితో పాటు మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాలని చూస్తోన్న సమంత ఓ హాలీవుడ్‌ చిత్రానికి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం విధితమే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!