AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్ మాయలో పడి భార్యకు విడాకులు ఇచ్చిన హీరో.. కానీ ఆమె ఏమంటుందంటే..

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, బ్రేకప్ లు చాలా కామన్ అయ్యాయి. హీరో, హీరోయిన్స్ చాలా మంది ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది సడన్ గా విడిపోతున్నాం అని అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. 17 , 18 ఏళ్ళు కలిసున్నా జంటలు కూడా విడిపోతున్నట్టు ప్రకటించి షాక్ ఇస్తున్నారు.

హీరోయిన్ మాయలో పడి భార్యకు విడాకులు ఇచ్చిన హీరో.. కానీ ఆమె ఏమంటుందంటే..
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2025 | 1:14 PM

Share

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు గట్టిగానే వినిపించాయి. అలాగే కొంతమంది విడాకులు కూడా  అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. కొంతమంది స్టార్ హీరో, హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్టు తెలిపి అభిమానులు షాక్ ఇచ్చారు. తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో చాలా మంది విడాకులు అనౌన్ చేశారు. రెండు మూడేళ్లకు విడిపోయిన వారు కొందరైతే.. మరికొంతమంది 17, 18 ఏళ్ళు కలిసిఉండి కూడా విడిపోయారు. అయితే ఓ స్టార్ కపుల్ విడిపోవడానికి ఓ హీరోయిన్ కారణం అంటూ ఈ మధ్య వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  హీరోయిన్ రిలేషన్స్ షిప్ లో ఉండటంతో ఆహీరో తన భార్యను వదిలేశాడని టాక్ గట్టిగా వినిపించింది. హీరోయిన్ మోజులో పడి భార్యను వదిలేశాడు అంటూ ఆ హీరోను, హీరోయిన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు, తిడుతున్నారు. ఇంతకూ ఆ హీరో ఎవరు.? ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఇది కూడా చదవండి :ఏం సినిమారా బాబూ..! రూ. 80కోట్లు పెట్టి తీస్తే రూ. 8కోట్లు కూడా రాబట్టలేకపోయింది

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు .  వారిలో ఈ బ్యూటీ ఒకరు. తన అందంతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఆమె అంటే పడిచచ్చిపోతున్నారు. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న దివ్య భారతి. తమిళ్ లో బ్యాచిలర్ అనే సినిమా చేసింది ఈ అమ్మడు. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ , నటుడు జీవి ప్రకాష్ తో కలిసి నటించింది. అలాగే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. దాంతో ఈఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటే వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : కేరాఫ్ కంచరపాలెం సలీమా గుర్తుందా.? ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.

ఇక జీవి ప్రకాష్ అతని భార్య సైందవి ఇటీవలే విడిపోతున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఈ జంట విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా నెటిజన్స్ దివ్య భారతి పై మండిపడుతున్నారు. జీవి ప్రకాష్ దివ్యభారతి మాయలో పడి భార్యకు విడాకులు ఇచ్చాడని చాలామంది ఆమెను తిడుతున్నారు. తాజాగా దీని గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. జీవి ప్రకాష్, దివ్యభారతి కలిసి ఇప్పుడు కింగ్ స్టెన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో దివ్యభారతి, జీవి ప్రకాష్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. కొందరు జీవి భార్యతో విడిపోవడానికి నేనే కారణం అని దారుణంగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. బ్యాచిలర్ సినిమాలో మా కెమిస్ట్రీ బాగుంది. బాగా వర్కౌట్ అయ్యింది. దాంతో మేము రిలేషన్ లో ఉన్నాం అంటూ వార్తలు పుట్టిస్తున్నారు అని దివ్యభారతి చెప్పుకొచ్చింది.  ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : మహేష్, పవన్‌లాంటి స్టార్స్‌తో ఆడిపాడిన ఈ బ్యూటీ గుర్తుందా..? 51ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా ఉంటున్న

దివ్య భారతి ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.