OTT Releases: ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సూపర్ హిట్ సినిమాలు, ఆకట్టుకునే సిరీస్‌లు ఇవే

వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి సందడి చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా సినిమాలు సందడి చేయనున్నాయి.

OTT Releases: ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సూపర్ హిట్ సినిమాలు, ఆకట్టుకునే సిరీస్‌లు ఇవే
Ott Movies
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 16, 2023 | 12:24 PM

ప్రతివారం కొత్త సినిమాలు థియేటర్స్ లో అలరిస్తుంటే మరో వైపు ఓటీటీల్లోనూ వీకెండ్ వచ్చిందటే చాలు రకరాల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి సందడి చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం ఏకంగా 15 సినిమాలు అభిమానులను అలరించడానికి రెడీ అయ్యాయి. వెబ్ సిరీస్ లు, సినిమాలు కలిపి పేక్షకులను ఆకట్టుకోనున్నాయి. నేడు థియేటర్స్ లో ఆదిపురుష్ లాంటి బిగ్ సినిమా రిలీజ్ అయినా నేపథ్యంలో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోనున్నాయి. ఏ ఏ ఓటీటీల్లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న సినిమాలు సిరీస్ లు..

1 . (ఎక్స్ ట్రాక్షన్ 2). క్రిస్ హెమ్స్ వర్త్ హీరోగా నటించిన హాలీవుడ్ సినిమా ఇది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉంటాయి. 2. (బ్లాక్ మిర్రర్ వెబ్ సిరీస్) .. బ్లాక్ మిర్రర్ అనేది చార్లీ బ్రూకర్ రూపొందించిన బ్రిటిష్ ఆంథాలజీ

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా..

3. (జీ ఖర్దా) మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ సినిమా నేడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

4. (రావణ కొట్టం ) తమిళ్ యాక్షన్ డ్రామా మూవీ ఇది. విక్రమ్ సుగుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

5. (అన్నీ మంచి శకునములే ) జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. నందిని నెద్ది ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 

6. (బిచ్చగాడు 2) విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయని సొంతం చేసుకుంది. ఈ మూవీ గతంలో వచ్చిన బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.

7. (సైతాన్) మహి వి రాఘవ్ దర్శకత్వం వచ్చిన క్రైం థ్రిల్లర్ ఇది. ఈ సిరీస్ ట్రైలర్ థ్రిల్ కు గురిచేసింది.

ఇక ఇతర ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఏవంటే..

ఈటీవీ విన్  8.  (కనులు తెరిచినా కనులు మూసినా)

సోనీ లివ్ 

9 . (ఫర్హానా)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 

10.(షెవలియర్)

11. (ఫుల్ కౌంట్ )

జియో సినిమా 

12. (రపూచక్కర్ ) 13. (ఐ లవ్ యు)

మనోరమా మ్యాక్స్

14 . వామనన్

జీ 5

15. తమిళరసన్