Tollywood: మన సినిమాల్లో మలయాళ వాసనలు.. టాలీవుడ్ వైపు అడుగులేస్తున్న స్టార్స్ వీరే

ఈ మధ్య కాలంలో క్రేజ్‌ ఉన్న ప్రాజెక్టులను కరెక్ట్ గా పరిశీలిస్తే ఎక్కడో ఒకచోట మలయాళం టచ్‌ కనిపిస్తుంది. మాలీవుడ్‌ హీరోలు చేసిన తెలుగు సినిమాల మీద మనవాళ్లు స్పెషల్‌ అటెన్షన్‌ పెడుతున్నారు.

Tollywood: మన సినిమాల్లో మలయాళ వాసనలు.. టాలీవుడ్ వైపు అడుగులేస్తున్న స్టార్స్ వీరే
Malayalam
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2022 | 1:10 PM

ఈ మధ్య కాలంలో క్రేజ్‌ ఉన్న ప్రాజెక్టులను కరెక్ట్ గా పరిశీలిస్తే ఎక్కడో ఒకచోట మలయాళం టచ్‌ కనిపిస్తుంది. మాలీవుడ్‌ హీరోలు చేసిన తెలుగు సినిమాల మీద మనవాళ్లు స్పెషల్‌ అటెన్షన్‌ పెడుతున్నారు. ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమా అయినా, కథలో బలం ఉన్న సబ్జెక్ట్ అయినా, సినిమాకు ప్యాన్‌ ఇండియా అప్పీల్‌ కావాలనుకుంటున్న ప్రతి సారీ మేకర్స్ మలయాళ హీరోల మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి నోటా ఒకటే మాట. సీతారామం సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నాం అని! రామ్‌గా దుల్కర్‌ సల్మాన్‌ యాక్టింగ్‌కి ఫిదా అయిపోయారు జనాలు. దుల్కర్‌కి తెలుగులో ఇదేం ఫస్ట్ స్ట్రయిట్‌ సినిమా కాదు. ఆల్రెడీ మహానటి చేశారు. ఇప్పుడు సీతారామమ్‌తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేశారు. అలాగే శాకుంతలం సినిమా ప్రమోషన్లు స్పీడందుకున్నాయి. ఈ సినిమాలో శకుంతలగా సమంతకు ఎంత క్రేజ్‌ ఉందో, అంతకు మించి వైరల్‌ అయింది దేవ్‌ మోహన్‌ పేరు. మలయాళంలో దేవ్‌ ఫిల్మోగ్రఫీ కూడా పెద్దదేం కాదు. కానీ దుష్యంతుడి కేరక్టర్‌కి పక్కాగా సెట్‌ అవుతారని సెలక్ట్ చేసుకున్నారు డైరక్టర్‌ గుణశేఖర్‌.

శాకుంతలంలోనే కాదు, యశోదలోనూ మలయాళ హీరోతోనే జోడీ కడుతున్నారు సమంత. న్యూ ఏజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది యశోద. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. యశోదలో డాక్టర్‌గా కనిపిస్తున్నారు ఉన్నిముకుందన్‌. గతంలో స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలు చేశారు ఉన్నిముకుందన్‌. ఇక డైరక్ట్ గా హీరోగా కాకపోయినా, విలన్‌గా తెలుగులో సాలిడ్‌ ఎంట్రీ ఇచ్చారు ఫాహద్‌ ఫాజిల్‌. పార్టీ లేదా పుష్పా అని ఆయన సినిమాలో బన్నీని అడిగినా, ఆయన పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన వారు మాత్రం పార్టీ లేదా ఫాహద్‌ అని అడుగుతున్నారు. తెలుగులో పుష్ప, తమిళ్‌లో విక్రమ్‌, మలయాళంలో హీరోగా చేసిన సినిమాలు అంటూ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లున్నాయి ఫాహద్‌ ఖాతాలో. ఇదిలా ఉంటే ఫాహద్‌కి ఎంత క్రేజ్‌ ఉందో, పృథ్విరాజ్‌కి కూడా అంతే క్రేజ్‌ ఉంది. లూసిఫర్‌ రీమేక్‌, బ్రో డాడీ, రీసెంట్‌గా జనగణమన అంటూ హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. సాలిడ్‌ కంటెంట్ తో జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు పృథ్విరాజ్‌. అందుకే ఆయన్ని సలార్‌లో కీ రోల్‌కి తీసుకున్నారు ప్రశాంత్‌ నీల్‌. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సలార్‌లో పృథ్విరాజ్‌ కేరక్టర్‌ ఎలా ఉంటుందోనని డార్లింగ్స్ అందరూ వెయిటింగ్‌. ఇలా మలయాళ హీరోలు మన సినిమాల్లో మెరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్