Naga Chaitanya: చైతూ, సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’కి ఏడాది పూర్తి.. ఎమోషనల్‌ ట్వీట్‌ చేసిన హీరో

Love Story Movie: అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), న్యాచురల్‌ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం లవ్‌స్టోరీ. ఫీల్‌గుడ్‌ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్‌ కమ్ముల ఈ హృద్యమైన ప్రేమకథను తెరకెక్కించారు.

Naga Chaitanya: చైతూ, సాయిపల్లవి 'లవ్‌స్టోరీ'కి ఏడాది పూర్తి.. ఎమోషనల్‌ ట్వీట్‌ చేసిన హీరో
Love Story Movie
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 26, 2022 | 3:21 PM

Love Story Movie: అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), న్యాచురల్‌ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం లవ్‌స్టోరీ. ఫీల్‌గుడ్‌ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్‌ కమ్ముల ఈ హృద్యమైన ప్రేమకథను తెరకెక్కించారు. గతేడాది సరిగ్గా ఇదే తేదీ (సెప్టెంబర్‌ 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. చైతూ, సాయిపల్లవిల నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.60 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఏడాది గడిచింది. ఈనేపథ్యంలో లవ్‌స్టోరీ చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్‌ చేశాడు. ‘ వన్‌ ఇయర్‌ ఫర్‌ లవ్‌ స్టోరీ. ఈ సినిమా నాకెన్నో విషయాలు నేర్పించింది. నాకెప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో మధురానుభూతులను అందించింది’ అని అందులో రాసుకొచ్చాడు చైతూ.

కాగా సమాజంలో కుల వ్యవస్థతో పాటు ఇంట్లో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ శేఖర్‌ కమ్ముల ఈ ప్రేమకథను తెరకెక్కించాడు. రాజీవ్‌ కనకాల, దేవయాని, ఈశ్వరి రావు, గంగవ్వ, ఉత్తేజ్‌లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. పవన్‌ సి.హెచ్‌ అందించిన స్వరాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఇందులోని సారంగదరియా పాట ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. యూట్యూట్‌లో ఈ సాంగ్‌కు మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఇక చై ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. బంగార్రాజు తర్వాత కృతిశెట్టి మరోసారి చైతూతో జతకట్టనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..