Vaarasudu: దళపతి క్రేజ్ మాములుగా లేదుగా.. వారసుడు ప్రీరిలీజ్ బిజినెస్ చూస్తే మైండ్ పోవాల్సిందే

ఇటీవల కాలంలో దళపతి విజయ్ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన బీస్ట్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు విజయ్...

Vaarasudu: దళపతి క్రేజ్ మాములుగా లేదుగా.. వారసుడు ప్రీరిలీజ్ బిజినెస్ చూస్తే మైండ్ పోవాల్సిందే
Vaarasudu
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 30, 2022 | 4:08 PM

దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో దళపతి విజయ్ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన బీస్ట్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు విజయ్. ఇక ఇప్పుడు తిరిగి సాలిడ్ హిట్ కొట్టాలన్న కసిమీద ఉన్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుగుతోందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీరిలీజ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయట. ప్రపంచవ్యాప్తంగా నాన్ థియేట్రికల్ గా అలాగే థియేట్రికల్ గా  ఈ సినిమా 280 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు  టాక్ వినిపిస్తోంది. ఇక తెలుగులో కూడా డీల్స్ క్లోజ్ అయితే మొత్తంగా  300 కోట్లకు చేరువయే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇక ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 90కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకున్నారట. మొత్తంగా  ఈ సినిమాకు 250కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందట. ఈ సినిమాను వంశీ తన స్టైల్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కికిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!