Unstoppable With NBK 2: బాలయ్య అన్ స్టాపబుల్‌లో సందడి చేయడానికి రెడీ అయిన కుర్ర హీరోలు

ఈ టాక్ షో దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారు బాలయ్య. తన స్టైల్ లో వచ్చిన గెస్ట్ లను తికమక పెడుతూ.. ప్రేక్షకులను అలరించారు బాలకృష్ణ. మొదటి సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే జోష్ తో సీజన్ 2 ను రెట్టింపు ఉత్సాహంతో మొదలు పెట్టారు.

Unstoppable With NBK 2: బాలయ్య అన్ స్టాపబుల్‌లో సందడి చేయడానికి రెడీ అయిన కుర్ర హీరోలు
Unstoppable With Nbk
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 30, 2022 | 4:27 PM

నటసింహం నందమూరి బాలకృష్ణలో మరోయాంగిల్ ను బయట పెట్టిన షో ఆహా అన్ స్టాపబుల్. బాలకృష్ణ ఎంత సరదా మనిషో కొందరికే తెలుసు. ఈ షో వల్ల తెలుగు రాష్ట్ర ప్రజలందరికి తెలిసింది. ఇక ఈ టాక్ షో దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారు బాలయ్య. తన స్టైల్ లో వచ్చిన గెస్ట్ లను తికమక పెడుతూ.. ప్రేక్షకులను అలరించారు బాలకృష్ణ. మొదటి సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే జోష్ తో సీజన్ 2 ను రెట్టింపు ఉత్సాహంతో మొదలు పెట్టారు. మొదటి ఎపిసోడ్ కు తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు రాగా.. రెండో ఎపిసోడ్ కు యంగ్ హీరోలు విశ్వక్ సేన్ , సిద్దు జొన్నల గడ్డ హాజరయ్యారు. ఈ రెండు ఎపిసోడ్ లు మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో ఎపిసోడ్ పై అందరికి ఆసక్తికి పెరిగిపోయింది. ఈ ఎపిసోడ్ కు మరో ఇద్దరు యంగ్ హీరోలు రానున్నారు.

అన్ స్టాపబుల్ సీజన్ 2కు ఇప్పుడు మరో ఇద్దరు కుర్ర హీరోలు.. శర్వానంద్, అడవి శేష్ హాజరుకానున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ ఆహా కొన్ని స్టిల్స్ ను రిలీజ్ చేసింది. ఈ స్టిల్స్ చూస్తుంటే కుర్రహీరోలతో పోటీగా బాలయ్య ఎనర్జీ కనిపిస్తోంది. శర్వానంద్ ఇటీవల ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకోగా.. శేష్ మేజర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

Adavi Shesh

Adavi Shesh

మరి ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ ఈ ఇద్దరు యంగ్ హీరోలను ఎలాంటి ప్రశ్నలు అడిగారు. ఎలాంటి సరదా సంభాషణ జరిగింది అన్నది తెలియాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేవరకు ఆగాల్సిందే. నవంబర్ 4న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి
Sharwanand

Sharwanand

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.