Thandel: అదరగొడుతున్న తండేల్.. రెండు రోజులకు కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే..
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది తండేల్. విడుదల మొదటి రోజు నుంచి పాజిటివ్ రివ్యూస్ అందుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ఇందులో రాజు, సత్య పాత్రలలో అద్భుతమైన నటనతో మెప్పించారు నాగచైతన్య, సాయి పల్లవి. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ మరింత బలంగా మారింది. ఈ మూవీలోని సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి.

తండేల్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా పేరే మారుమోగుతుంది. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాగా నిలిచింది. వాస్తవ సంఘటనల ఆధారంగా చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు వచ్చింది. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజు ఈ సినిమా రూ.21.27 కోట్లు రాబట్టింది. చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది తండేల్.
ఇక నిన్న శనివారం వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద తండేల్ దెబ్బ బలంగానే పడింది. రెండు రోజులకు గానూ ఈ సినిమా రూ.41.20 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ సినిమా సులభంగా రూ.50 కోట్ల మార్క్ దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మించారు.
ఈ సినిమా విడుదలకు ముందే పాటలు, డైలాగ్స్, టీజర్, ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. అలాగే ఇందులో చైతన్య మాస్ అండ్ రఫ్ లుక్ లో కనిపించారు. ఇక లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ తర్వాత సాయి పల్లవి, చైతన్య మరోసారి జంటగా నటించడంతో ఈ సినిమాను చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
#BlockbusterThandel collects 𝟒𝟏.𝟐𝟎 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐑𝐎𝐒𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in 2 days ❤️🔥
𝗗𝗔𝗬 𝟮 >> 𝗗𝗔𝗬 𝟭 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗦𝘁𝗮𝘁𝗲𝘀 🔥A super strong day 3 loading 💥💥
Book your tickets for #Thandel now!🎟️ https://t.co/TComU1URgB… pic.twitter.com/ygouBQl4PQ
— Thandel (@ThandelTheMovie) February 9, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన