Thalapathy Vijay: విజయ్ చివరి సినిమాకు కళ్లు చెదిరిపోయే డీల్.. ఏకంగా రూ. 75 కోట్లా?
దళపతి విజయ్ చివరి చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ నిర్మిస్తున్నారు. విజయ్‌కి ఇదే చివరి సినిమా కావడంతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్ణయించింది. విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

దళపతి విజయ్ 69వ చిత్రానికి ‘జననాయగన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇదే తన చివరి సినిమా అని విజయ్ స్వయంగా ప్రకటించాడు. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయ్ త్వరలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనున్నారు. ఇదిలా ఉంటే విజయ్ చివరి చిత్రాన్ని కర్ణాటక కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. విజయ్ ఆఖరి మూవీని అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని కెవిఎన్ నిర్మాణ సంస్థ నిర్ణయించింది. ‘జననాయగన్’ సినిమా కోసం కెవిఎన్ వెంకట్ కె నారాయణ్ భారీ బడ్జెట్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. భారీ సెట్లు, భారీ వీఎఫ్‌ఎక్స్ మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా చిత్రీకరణ జరుపుకునేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దళపతి విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిదని తెలుస్తోంది.
కాగా ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించింది కెవిఎన్ నిర్మాణ సంస్థ. గణేష్ నటించిన ‘సఖత్’ సినిమాతో సినిమా నిర్మాణం ప్రారంభించిన వెంకట్ ఆ తర్వాత ‘బై టు లవ్’ నిర్మించి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు కెవిఎన్ ప్రొడక్షన్ నుండి వరుస సినిమాలు తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ధృవ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో ‘కెడి’, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా ‘టాక్సిక్’ వంటి క్రేజీ పాన్ ఇండియా సినిమాలను కేవీఎన్ సంస్థ నిర్మిస్తోంది. వీటితో పాటు మలయాళంలో ఓ సినిమాను రూపొందిస్తోంది.
కాగా తాజా కథనాల ప్రకారం జననాయగన్ ఓవర్సీస్ రైట్స్‌కు ఏకంగా రూ.75 కోట్లు పలికినట్టు ఇన్‌సైడ్ టాక్. విజయ్‌కు ఓవర్సీస్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. కాగా రిపబ్లిక్ డే సందర్భంగా విజయ్ నటించిన జననాయగన్ పోస్టర్ విడుదలైంది.ఈ పోస్టర్‌లో విజయ్ నడుముపై చేతులు వేసుకుని నిలబడి ఉండగా, అతని వెనుక పెద్ద సంఖ్యలో అనుచరులు నిలబడి సెల్ఫీ తీసుకుంటూ కనిపించాడు. విజయ్ పొలిటికల్ ఎంట్రీని దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రానికి ‘జన నాయగన్’ అనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ప్రముఖ తమిళ దర్శకుడు హెచ్ వినోద్ ‘జన నాయగన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
దళపతి విజయ్ సినిమా కొత్త పోస్టర్..
We call him #JanaNayagan #ஜனநாயகன் ♥️#Thalapathy69FirstLook#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja @_mamithabaiju @anirudhofficial @Jagadishbliss @LohithNK01 @sathyaDP @ActionAnlarasu @Selva_ArtDir… pic.twitter.com/t16huTvbqc
— KVN Productions (@KvnProductions) January 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








