Kandikonda Death: చిత్ర పరిశ్రమలో విషాదం.. గేయ రచయిత కందికొండ కన్నుమూత..
ప్రముక కవి.. సినీ గేయ రచయిచ కందికొండ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో
ప్రముఖ కవి.. సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి (Kandikonda) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కందికొండ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. కందికొండ అకాల మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది.
With a heavy heart, i would like to inform the twitter and industry family that Lyricist Kandikonda garu is no more. Wishing for God to give his family strength to deal with the loss. OmShanti
— Smita (@smitapop) March 12, 2022
సినిమా పాటకు తెలంగాణ యాసను అద్దిన కవులలో కందికొండ ఒకరు. తెలంగాణ యాసలో పాటలు రాయడం.. బతుకమ్మ పాటలను ప్రపంచానికి పరిచయం చేశారు. పలు చిత్రాల్లో సూపర్ హిట్ పాటలు రాసిన కందికొండ.. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. క్యాన్సర్ మహమ్మారితో దాదాపు రెండేళ్లు పోరాడిన కందికొండ.. ప్రస్తుతం పెరాసిస్ సమస్యతో బాధపడుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమో థెరపీ చేయించుకోవడంతో.. కందికొండ స్పైనల్‌కార్డ్ లోని సీ1 సీ2 భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో కందికొండ నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో కందికొండ ఆర్థిక సాయం ఎదురుచూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కందికొండ ఈరోజు (మార్చి 12న) తుదిశ్వాస విడిచారు. రేపు హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు సమాచారం..
Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాపై మీమ్స్‌తో ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తమన్..
Anchor Anasuya: మీవల్లే స్ట్రాంగ్‌గా నిలబడ్డాను.. మీరే నా ఆర్మీ.. యాంకర్ అనసూయ ఆసక్తికర కామెంట్స్..