ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా ?.. ఫేమస్ రైటర్.. నటుడు కూడా.. ఈయన డైలాగ్స్ వేరేలెవల్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ (Paruchuri Brothers) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మాటల రచయితగా.. నటులుగా తమకంటూ

టాలీవుడ్ ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ (Paruchuri Brothers) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మాటల రచయితగా.. నటులుగా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దశాబ్దాలుగా.. చిత్రపరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ మాటలు.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీరిలో అన్న పరుచూరి వెంకటేశ్వర్ రావు (Paruchuri Venkateshwar rao) డైలాగ్స్ పవర్ గురించి తెలిసిందే. ఇండస్ట్రీలో ఫేమస్ రైటర్ గా చాలా కాలం చక్రం తిప్పారు. నందమూరి తారక రామారావు.. 1981లో పరుచూరి వెంకటేశ్వరరావు .. పరుచూరి గోపాలకృష్ణలకు పరుచూరి బ్రదర్స్ అని నామకరణం చేశారు. అంతేకాకుండా.. తన సొంత చిత్రం అనురాగ దేవత సినిమాతో వీరిద్దరిని రచయితలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మూడు వందలకు పైగా చిత్రాలకు రచన చేశారు. కేవలం రచయితలుగానే కాకుండా.. నటులుగానూ అలరించారు. అలాగే పలు చిత్రాలను తెరకెక్కించి దర్శకులుగా సక్సెస్ అయ్యారు. చాలా కాలంగా పరుచూరి గోపాలకృష్ణ వెండితెరపై కనిపించలేదు.
ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో బయటకు రావడం లేదు. ఇటీవల ప్రముఖ డైరెక్టర్ జయంత్ సీ. పరాంజీ పరుచూరి వెంకటేశ్వరరావును కలిశారు. అప్పుడు తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు. గురువు గారు వెంకటేశ్వర రావును చూసి బాధపడ్డాను. కానీ దేవుడి దయవల్ల ఆయన మానసిక స్థితి ఎప్పటిలాగే చురుకుగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన షేర్ చేసిన ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఫేమస్ రైటర్ ఇలా అయ్యారెంటీ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వర రావు.. దృశ్యం, వీర, నేనున్నాను.. తూనీగ తూనీగ వంటి చిత్రాల్లో నటించారు.
ఇన్‌స్టా పోస్ట్..
View this post on Instagram
Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాపై మీమ్స్‌తో ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తమన్..
Anchor Anasuya: మీవల్లే స్ట్రాంగ్‌గా నిలబడ్డాను.. మీరే నా ఆర్మీ.. యాంకర్ అనసూయ ఆసక్తికర కామెంట్స్..




