Telugu Movies : హాట్ కేకుల్లా టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ సినిమా శాటిలైట్ రైట్స్
థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడన్న విషయంలో క్లారిటీ లేకపోయినా... టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ సినిమా శాటిలైట్ డీల్స్ మాత్రం అయిపోయాయి.
Telugu Movies Satellite Rights: థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడన్న విషయంలో క్లారిటీ లేకపోయినా… టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ సినిమా శాటిలైట్ డీల్స్ మాత్రం అయిపోయాయి. రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలే కాదు.. ఇంకా షూటింగ్ ప్రాసెస్ కంప్లీట్ కానీ సినిమాలను కూడా ముందే బుక్ చేసి పెట్టుకుంటోంది… తెలుగు బుల్లితెర. ఎంటర్‌టైన్మెంట్ ఛానల్స్ మధ్య పోటి పెరగటంతో సినిమాలు హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఓ ఛానెల్ తమ దగ్గరున్న అప్ కమింగ్ సినిమాల లిస్ట్‌ను ఎనౌన్స్ చేసింది. మోస్ట్ అవెయిటెడ్ బిగ్ ప్రాజెక్ట్స్‌తో పాటు… క్రేజీ కాంబినేషన్స్… మాస్ మసాల ఎంటర్‌టైనర్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ లిస్ట్ చూసిన తరువాత ఆ సినిమాల థియేట్రికల్ రిలీజ్ మీద కూడా చర్చ మొదలైంది.
కోవిడ్ ఫస్ట్ వేవ్.. సెక్ట్ వేవ్‌ల కారణంగా స్టార్ హీరోల సినిమాలన్ని పెండింగ్ పడిపోయాయి. మాములుగా అయితే ఒక్కో సీజన్‌కు ఇద్దరు ముగ్గురు స్టార్‌లు పోటి పడతారు. కానీ ఇప్పుడున్న సిచ్యుయేషనే వేరు.. సరైన సీజన్ దొరికితే.. పదికి పైగా సినిమాలు రిలీజ్ అయ్యేంత టైట్ షెడ్యూల్… మరి ఇంత పోటిని మేకర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :




