Top Movies: జాతీయ స్థాయిలో సత్తా చాటుతోన్న తెలుగు సినిమాలు.. మొదటి స్థానంలో బన్నీ, నాలుగో స్థానంలో..
Top Movies: ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోతోంది. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు స్టామినా ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిని అవలీలగా అందుకుంటోన్న తెలుగు సినిమాలపై జాతీయ...
Top Movies: ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోతోంది. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు స్టామినా ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిని అవలీలగా అందుకుంటోన్న తెలుగు సినిమాలపై జాతీయ స్థాయిల్లో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఐఎండిబి ఇండియన్ మోస్ట్ అవేటెడ్ సినిమాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్ఫ తొలి స్థానంలో నిలవడం విశేషం. సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. దీనికి ఉదాహరణే ఐఎండిబి జాబితా. ఇక టాప్ 10 సినిమాల్లో మరో తెలుగు సినిమా రాధే కూడా చోటు దక్కించుకుంది. ఈ సినిమా నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ స్టామినా ఒక్కసారిగా పెరగడం దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇక ఈ జాబితాలో కేజీఫీ రెండో స్థానంలో నిలవగా.. మూడో స్థానంలో హసీన్ దిలుర్బా, ఐదో స్థానంలో బెల్ బాటమ్, ఆరో స్థానంలో తుఫాన్, ఏడో స్థానంలో అట్రంగ రే, ఎనిమిదవ స్థానంలో మరాక్కర్, తొమ్మిదవ స్థానంలో గంగూభాయ్, పదో స్థానంలో ఫీల్స్ లైక్ ఇష్క్ సినిమాలున్నాయి.
Also Read: MAA Elections 2021: రోజురోజుకు రసవత్తరంగా మారుతన్న ‘మా’ ఎన్నికలు.. అధ్యక్ష బరిలో మరో నటుడు
Naga Shaurya: మొదలైన నాగశౌర్య సినిమా… శరవేగంగా ‘వరుడు కావలెను’ సినిమా షూటింగ్