Uday Kiran : ఒక తరానికి మధురమైన జ్ఞాపకంగా నిలిచిన శాశ్వత సంతకం ఉదయ్ కిరణ్ కెరీర్ లో ఆగిన సినిమాలు ఎన్నో తెలుసా

Uday Kiran : తెలుగు సినీ పరిశ్రమలో చిత్రం సినిమాతో అడుగు పెట్టి.. ప్రేక్షకులను నువ్వు నేను అంటూ ఉర్రుతలూగించి.. మనసంతా నువ్వే అంటూ అమ్మాయిల కలల హీరో.. లవర్ బాయ్..

Uday Kiran : ఒక తరానికి మధురమైన జ్ఞాపకంగా నిలిచిన శాశ్వత సంతకం ఉదయ్ కిరణ్ కెరీర్ లో ఆగిన సినిమాలు ఎన్నో తెలుసా
Uday Kiran
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2021 | 1:52 PM

Uday Kiran : తెలుగు సినీ పరిశ్రమలో చిత్రం సినిమాతో అడుగు పెట్టి.. ప్రేక్షకులను నువ్వు నేను అంటూ ఉర్రుతలూగించి.. మనసంతా నువ్వే అంటూ అమ్మాయిల కలల హీరో.. లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టి.. వరసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఉదయకిరణ్ చిన్న వయసులోనే తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయాడు. టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ ఒక తరం మొత్తానికి మధురమైన జ్ఞాపకంగా నిలిచిన శాశ్వత సంతకం గా నిలిచాడు. ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు ఏడేళ్లు అయినా ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదట్లోనే తారాజువ్వలా పైకి ఎగిరి.. శ్లేష్మంలో పడిన ఈగలా గిలాగిలాడుతూ .. సినీ పాకుడురాళ్ల మీద నుంచి జారిపడిపోయాడు. నటించిన సినిమాల్లో తన నటనతో తనదైన ముద్ర వేసిన ఉదయ్ కిరణ్ తన సినీ కెరీర్ లో దాదాపు 10 సినిమాలను మిస్ చేసుకున్నాడు. కొన్ని షూటింగ్స్ మొదలయ్యి.. ఆగిపోగా.. కొన్ని సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయాయి.. ఆ లిస్ట్ ఏమిటో చూద్దాం

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో ఉదయ్ కిరణ్ హీరోగా ప్రేమంటే సులువు కాదురా సినిమా మొదలుపెట్టారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తర్వాత అనుకోని కారణాలతో సినిమా ఆగిపోయింది. ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ప్రత్యూష క్రియేషన్స్ ఒక సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టకుండానే క్లోజ్ అయ్యింది. అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా సినిమా తెరకెక్కాల్సి ఉంది. అప్పటి పరిష్టితుల దృష్ట్యా అది ఆగిపోయింది. ఇక బాలకృష్ణ బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో సౌందర్య కీలక పాత్రలో నర్తనశాల సినిమా తీయాలని అనుకున్నారు. ఈ సినిమాలో అభిమన్యుడి పాత్ర కోసం ఉదయ్ కిరణ్ ను అనుకున్నారు. అయితే ఆ సినిమా సౌందర్య మరణించడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ జబ్ వి మిట్ మూవీ తెలుగు రీమేక్ లో ఉదయ్ కిరణ్, త్రిష లను అనుకున్నారు.. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఉదయ్ కిరణ్, సదా జంటగా ఓ సినిమాను ప్లాన్ చేసింది. లవర్స్ టైటిల్ ను కూడా పిక్స్ చేశారు.. కానీ ఈ సినిమా కూడా పట్టాలెక్కలేదు. ఆదిశంకరాచార్య సినిమాను ఉదయ్ కిరణ్ చేయాల్సి ఉంది. అప్పటికే మార్కెట్ పడిపోవడంతో నిర్మాతలు సినిమా ను ఆపేశారు… ఉదయ్ కిరణ్‌తో మనసంతా నువ్వే, నీ స్నేహం హిట్ సినిమాలను నిర్మించిన ఎంఎస్ రాజు హ్యాట్రిక్‌గా మరో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది. చంద్ర శేఖర్ యేలేటి తో కూడా సినిమా అనౌన్స్ తోనే ఆగిపోయింది. ఉదయ్ కిరణ్ ను వెండి తెరకు పరిచయం చేసిన తేజ ఉదయ్ కిరణ్ తో సినిమా చేయాలను కున్నాడు.. ఇంతలోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు.

Also Read: బోద కాలితో బాధపడుతున్నారా.. ఇంట్లో సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందండి ఇలా