kabza movie: ఆకట్టుకుంటున్న ‘కబ్జ’ మూవీ న్యూ పోస్టర్.. ఉపేంద్రతోపాటు ఆ స్టార్ హీరో కూడా..
విలక్షణ నటుడు ఉపేంద్ర నటిస్తున్న తాజా చిత్రం కబ్జ. ఉపేంద్ర ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ను రాణిస్తున్నాడు.
kabza movie: విలక్షణ నటుడు ఉపేంద్ర నటిస్తున్న తాజా చిత్రం కబ్జ. ఉపేంద్ర ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ను రాణిస్తున్నాడు. ఈ క్రమంలో త్వరలో కబ్జ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సినిమాను ఏకంగా ఏడూ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఉపేంద్ర సినిమా అంటే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగు మంచి టాక్ ను తెచ్చుకున్నాయి. ఆర్.చంద్రు దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.
ఉపేంద్ర- కిచ్చా సుదీప్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాగా భారీ హైప్ నెలకొంది.కిచ్చా సుదీప్ వర్సెస్ రియల్ స్టార్ ఉపేంద్ర ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉంటాయని తెలిసింది. తాజాగా రియల్ స్టార్ వర్సెస్ బాద్ షా పోస్టర్ అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇందులో ప్రకాష్ రాజ్.. జయప్రకాష్ రెడ్డి.. ప్రదీప్ రావత్ .. కబీర్ దుహాన్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ముకుంద మురారి లాంటి సోషియో సెటైరికల్ మూవీ తర్వాత సుదీప్- ఉపేంద్ర కలిసి నటిస్తున్న చిత్రమిది.
#Kabzaa #rchandru #KicchaSudeep pic.twitter.com/WVvwqsId2R
— Upendra (@nimmaupendra) June 27, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :