Nidhhi Agerwal: తెలుగు- తమిళ్ భాషల్లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిన ఇస్మార్ట్ బ్యూటీ…
నిధి అగర్వాల్ .. ఈ అమ్మడిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
nidhi agarwal: నిధి అగర్వాల్ .. ఈ అమ్మడిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత అఖిల్ కు జోడీగా మిస్టర్ మజ్ను సినిమాలో నటించి ఆకట్టుకుంది. అయితే డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో నిధి తన అందాలతో కుర్రకారుని కట్టిపడేసింది. అయితే ఈ ఏడాది తమిళంలో నిధి చేసిన డెబ్యూ మూవీతో పాటు సెకండ్ మూవీ కూడా హిట్ అవ్వడం విశేషం. తమిళ హీరో శింబుతో ఈశ్వరన్ జయం రవితో భూమి సినిమాలు చేసింది. ఆ రెండు హిట్ అవ్వడంతో అమ్మడికి తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయని టాక్. ప్రస్తుతం అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమా చేస్తోంది. ప్రస్తుతం వయ్యారి చేతిలో రెండు తెలుగు సినిమాలు.. తమిళంలో ఓ సినిమా ఉన్నాయి. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న హీరో మూవీలో నిధినే హీరోయిన్. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తెలుగులో ఈ రెండు తప్ప వేరే సినిమాలు లేవు. కానీ త్వరలోనే అమ్మడు తమిళంలో బిజీ కానున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో తమిళంలో చేస్తున్న సినిమా ల కారణంగా వచ్చే ఏడాది బిజీ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది. మరో వైపు హిందీ నుండి కూడా ఈమెకు చిన్నా చితకా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. వరుసగా ఇన్ని భాషల్లో సినిమా లు చేస్తున్న నిధి అగర్వాల్ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల బిజీ బిజీగా ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :