Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బరిలో మంచువారబ్బాయి.. నామినేషన్ వేస్తున్నట్టు ప్రకటించిన విష్ణు
ఈ సారి మా ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగనున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారాన్ని రేపుతున్నాయి.
Manchu Vishnu: ఈ సారి మా ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగనున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారాన్ని రేపుతున్నాయి. అధ్యక్ష స్థానాన్ని కోరుతున్న ప్రకాశ్ రాజ్ మిగిలిన వారి కంటే ముందున్నారు. ‘మా’ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించటంతో పాటు.. తాను పోటీ చేయనున్నట్లుగా ప్రకాశ్ రాజ్ చెప్పిన తర్వాత పలు వివాదాలు రాజుకున్నాయి. కన్నడిగు అయిన ప్రకాశ్ రాజ్.. తెలుగు సినిమా రంగానికి చెందిన ‘మా’కు అధ్యక్షుడు ఎలా అవుతారన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. ఆయన్ను నాన్ లోకల్ గా వ్యాఖ్యలు చేయటంపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశాన్ని తీవ్రంగా తప్పుపడుతూ శుక్రవారంప్రకాశ్ రాజ్ తన టీంలోని కొందరితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించటం తెలిసిందే. తాజాగా మా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నట్టు నటుడు మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
మా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నానని,ఆ విషయాన్ని మా కుటుంబసభ్యులైన మీ అందరికి తెలియజేయడం గౌరవప్రదంగా భావిస్తున్నానని విష్ణు అన్నారు. సినిమా పరిశ్రమను నమ్మిన కుటుంబంలో పుట్టిన తనకు మన సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు తెలుసని అన్నారు. అలాగే గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశానని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహారాలను చాలా దగ్గర పరిశీలించిన తనకు మా సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన ఉందని మంచు విష్ణు తెలిపారు.
నా MAA కుటుంబానికి ?.To my MAA family ? pic.twitter.com/1TDa3f8lYA
— Vishnu Manchu (@iVishnuManchu) June 27, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :