RIP Krishna Garu: జై ఆంధ్ర ఉద్యమంలో కృష్ణ కీలక పాత్ర.. ఆయన చేసిన ఆ ఒక్క ‘ప్రకటన’ నేటికీ..

తెలుగు చిత్రసీమలో ధృవతారగా నిలిచిన సూపర్‌ స్టార్‌ కృష్ణ తొలి నుంచీ ఓ పదునైన రాజకీయ భావజాలం ఉన్న వ్యక్తి. తొలి రోజుల్లోనే కృష్ణలో కొన్ని నిర్దిష్టమైన, బలమైన రాజకీయ..

RIP Krishna Garu: జై ఆంధ్ర ఉద్యమంలో కృష్ణ కీలక పాత్ర.. ఆయన చేసిన ఆ ఒక్క ‘ప్రకటన’ నేటికీ..
Krishna In Jai Andhra Movement
Follow us

|

Updated on: Nov 15, 2022 | 1:03 PM

తెలుగు చిత్రసీమలో ధృవతారగా నిలిచిన సూపర్‌ స్టార్‌ కృష్ణ తొలి నుంచీ ఓ పదునైన రాజకీయ భావజాలం ఉన్న వ్యక్తి. తొలి రోజుల్లోనే కృష్ణలో కొన్ని నిర్దిష్టమైన, బలమైన రాజకీయ అభిప్రాయాలున్నాయి. అందుకే ఆయన సినిమాలనేకం ప్రజాచైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అన్నింటికీ మించి సూపర్‌ స్టార్‌ కృష్ణలోని రాజకీయ చైతన్యం ఆనాడు ఆయన్ను ప్రత్యేక ఆంధ్రా ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ప్రారంభమైన ఈ ఉద్యమం భారత చరిత్రలోనూ అపూర్వమైనదంటూ ఆప్రకటనలో ప్రస్తావించారు. ఆంధ్ర ప్రజానీకమంతా ఒక్కతాటిమీద నించి ఒకే మాట మీద నిలబడ్డారు. ఇది ప్రజా వెల్లువ. ఈ వెల్లువను ఆపేశక్తి ఎవ్వరికీ లేదంటూ ప్రకటిస్తారు కృష్ణ.

జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న కృష్ణ ఉద్యమంలో భాగంగా దీక్ష చేపట్టారు. ముల్కీ నిబంధనలపై ఆనాటి సుప్రీంకోర్టు తీర్పుపై ఓ ప్రకటన చేశారు. అది ఆనాటి రాజకీయాల్లో ఆయన పాత్రపై స్పష్టతనిస్తుంది. ఆ నాటి కృష్ణ ప్రకటనలో.. గత మూడు నెలలుగా రాష్ట్రంలో ప్రజా జీవితం స్థంభించి పోయిందనీ, ఎన్‌జీవోలు, విద్యార్థులు, పిల్లలూ, పెద్దలూ, లాయర్లు, డాక్టర్లు, మహిళలు ప్రత్యేక ‘ఆంధ్రరాష్ట్రం కోసం’ ఆందోళన ప్రారంభించారనీ అందులో నేనూ ఒక భాగమే కనుక ఈ ఉద్యమంలో నాకూ భాగం ఉంది అంటూ ప్రస్తావిస్తారు కృష్ణ. అంతేకాదు.. ఆంధ్ర ప్రజానీకమంతా ఒక్కతాటిమీద నుంచుని.. ఒకే మాట మీద నిలబడ్డారు. ఇది ప్రజా వెల్లువ. ఈ వెల్లువను ఆపేశక్తి ఎవ్వరికీ లేదంటూ ప్రకటించారు కృష్ణ.

తెలుగు చిత్రసీమలో సుదీర్ఘానుభవం కలిగిన ఈ నటశేఖరుడిలో తొలి నుంచీ ఓ బలమైన రాజకీయ భావజాలం అంతర్లీనంగా దాగి ఉంది. అదే చైతన్యం ఆయన్ను అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేసింది. మన్నెం వీరుడిగా తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన కృష్ణ రాజకీయ ప్రస్థానం ప్రత్యేకమైనది. తొలి రోజుల్లో ఏ పార్టీ పునాదులూ లేకుండానే దళారుల చేతుల్లో దగాపడ్డ రైతన్నలపైనా.. ప్రజాసమస్యలపైనా ఎన్నో సినిమాలు తీశారు. ప్రజలను, వారి హక్కులనూ కాపాడాల్సిన ప్రజాస్వామ్యంపైన కూడా కృష్ణకి కొన్ని నిర్దిష్టమైన, బలమైన రాజకీయాభిప్రాయాలున్నాయి. అందుకే ఆయన సినిమాలనేకం ప్రజాచైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆయనలో అంతర్లీనంగా పెల్లుబికే రాజకీయ స్ఫూర్తి ఆయన్ను ఆ తరువాత రాజకీయారంగేట్రం చేసేలా చేసింది. ఆయన రాజకీయాల్లో ఉన్నది అతితక్కువ కాలమే అయినా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రత్యేకమైనదే.

ఇవి కూడా చదవండి

ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్‌ గాంధీకీ, సూపర్‌ స్టార్‌ కృష్ణకీ అనుబంధం ఏర్పడింది. ఇందిరాగాంధీ అంత్యక్రియలకు సైతం కృష్ణ హాజరయ్యారు. 1984 లో ఎన్టీఆర్‌ బర్తరఫ్‌ అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల భాస్కర్‌ రావుని కృష్ణ సమర్థించడం, ఆయన్ను అభినందిస్తూ ప్రకటనలు చేయడం రాజకీయాల్లోనూ, సినీ ఇండస్ట్రీలోనూ ఆనాడు సంచలనాత్మకంగా మారింది. ప్రజారంజక, రామరాజ్యం తన లక్ష్యమని సినిమాల్లో చాటిచెప్పిన కృష్ణ అనంతరం రాజీవ్ గాంధీ ప్రోత్సాహాంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1989 లో ఏలూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున నేరుగా లోక్ సభ ఎంపీగా పోటీ చేశారు సూపర్‌ స్టార్‌ కృష్ణ. ఈ ఎన్నికల్లో 71 వేల భారీ మెజార్టీతో ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పై విజయం సాధించారు సూపర్ స్టార్ కృష్ణ. ఆ తరువాత ఆప్తమిత్రుడైన రాజీవ్‌ మరణంతో రాజకీయాలకు మెల్లిగా దూరమయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..