Emergency: కంగనాకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. రాష్ట్రంలో ‘ఎమర్జెన్సీ’ మూవీ బ్యాన్..?
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె ఇందిరాగాంధీ పాత్రలో నటించారు. 1975 జూన్ 25 నుంచి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమాను రాష్ట్రంలో నిషేదించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలంగాణలో విడుదల నిషేధం విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇప్పటికే మాజీ ఐపీఎస్ అధికారికి తేజ్ దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ సినిమా విడుదల నిషేధం విధించాలని అభ్యర్థించినట్లు తెలిపారు. ఇందులో సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని.. ఈ మూవీ షూటింగ్ పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ 18 మంది సభ్యుల సిక్కు సొసైటీ బృందం రిప్రజెంటేషన్ సమర్పించినట్లు షబ్బీర్ తెలిపారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని.. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ పై న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూనే విడుదలను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సిక్కు సంఘం నేతలకు హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ గురువారం తెలిపారు.
ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) మాజీ అధికారి తేజ్‌దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో షబ్బీర్‌ను కలిసి “ఎమర్జెన్సీ” స్క్రీనింగ్‌పై నిషేధం విధించాలని అభ్యర్థించింది. ఈ చిత్రంలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది సహించలేమని.. అలాగే సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరించారని సిక్కు బృందం తెలిపింది. తెలంగాణలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని షబ్బీర్ ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు షబ్బీర్ తెలిపారు. తెలంగాణ జనాభాలో సిక్కు సమాజం 2 శాతంగా ఉంది.
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె ఇందిరాగాంధీ పాత్రలో నటించారు. 1975 జూన్ 25 నుంచి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించగా.. కంగనా హోం బ్యానర్ మణికర్ణిక ఫిల్మ్ పతాకంపై నిర్మించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.