Hanuman: బంపరాఫర్‌.. ‘హనుమాన్’ మూవీ టికెట్ల ధరల తగ్గింపు.. కొత్త రేట్స్‌ ఇవే.. ఎప్పటివరకంటే?

సంక్రాంతి కనుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధించి ట్రేడ్‌ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. రిలీజై నెలన్నర రోజులు గడిచినా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇదిలా ఉంటే హనుమాన్‌ సినిమాను మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు మేకర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు

Hanuman: బంపరాఫర్‌.. 'హనుమాన్' మూవీ టికెట్ల ధరల తగ్గింపు.. కొత్త రేట్స్‌ ఇవే.. ఎప్పటివరకంటే?
Teja Sajja Hanuman
Follow us
Basha Shek

|

Updated on: Feb 17, 2024 | 4:02 PM

ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది హనుమాన్‌. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. అమృతా అయ్యర్ హీరోయిన్‌. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ మరో కీలక పాత్ర పోషించగా, వాన ఫేమ్‌ వినయ్‌ రాయ్‌ స్టైలిష్‌ విలన్‌ గా మెప్పించాడు. సంక్రాంతి కనుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధించి ట్రేడ్‌ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. రిలీజై నెలన్నర రోజులు గడిచినా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇదిలా ఉంటే హనుమాన్‌ సినిమాను మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు మేకర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు.ప్రస్తుతం సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో హను-మాన్‌ టికెట్‌ ధర రూ.175లుగా ఉంది. ఇకపై ఈ టికెట్స్‌ రూ.100ల కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.295గా ఉన్న టికెట్‌ ధరను ఏకంగా రూ.150 కి తగ్గించారు. ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. అయితే ఈ డిస్కౌంట్‌ కేవలం నైజాం ఏరియాలోని థియేటర్లకే వర్తిస్తాయి. కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

థియేటర్లలో సక్సెస్‌ ఫుల్‌ గా రన్‌ అవుతుండడంతో హనుమాన్‌ మూవీ ఇప్పట్లో ఓటీటీలో వచ్చేలా లేదని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 కొనుగోలు చేసింది. బహుశా మార్చి 2వ వారంలో హనుమాన్‌ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశముంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్..

హిందీలోనూ కలెక్షన్ల సునామీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.