Guntur Kaaram: సూపర్ స్టార్‌తో పోటీ ఏంటి సార్..? గుంటూరు కారం గురించి తేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గుంటూరు కారం సినిమాను జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక అదే రోజు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యంగ్ హీరో తేజ సజ్జ. హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది.
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీనే జరగనుంది. ఈ సారి ఏకంగా 5 సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసి రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా భారీగా రిలీజ్ అవుతుంది. గుంటూరు కారం సినిమాను జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక అదే రోజు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యంగ్ హీరో తేజ సజ్జ. హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది.
ఇప్పటికే హనుమాన్ సినిమా పై కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు లాంటి బడా హీరోల సినిమాకు పోటీగా హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా పై ఉన్న నమ్మకంతో హనుమాన్ టీమ్ వెనక్కి తగ్గడంలేదు.
అయితే గుంటూరు కారం సినిమాకు పోటీగా తేజ వస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో తేజ సజ్జ మహేష్ బాబు తో కలిసి యువరాజు సినిమాలో నటించాడు. యువరాజు సినిమాలో మహేష్ బాబు కొడుకుగా నటించాడు. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై తేజ సజ్జ ట్వీట్ చేశాడు. ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ సైట్ రాసిన ఆర్టికల్ కు రీప్లే ఇస్తూ.. సూపర్ స్టార్ తో పోటీ ఏంటి సార్.. ఆయనతో పోటీగా కాదు సార్.. ఆయనతో పాటుగా అంటూ ట్వీట్ చేశాడు తేజ.
తేజ సజ్జ ట్వీట్
#SuperStar tho poti enti sir 🤦♂️🙏 అయన తో పోటీగ కాదు సర్ అయన తో పాటుగ https://t.co/EaSpkdjkp8
— Teja Sajja (@tejasajja123) January 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.