Dunki Movie : డంకీ సినిమా కలెక్షన్స్ గురించి షారుక్ ఖాన్ ముందే చెప్పారట.. రాజ్ కుమార్ హిరానీ షాకింగ్ కామెంట్స్
పఠాన్, జవాన్ సినిమాలు భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. కానీ డంకి సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్స్ కూడా అంతగా రాలేదు. షారుఖ్ ఖాన్ 'పఠాన్', 'జవాన్' సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్లు వరకు వసూల్ చేశాయి. అందుకే ‘డంకీ’ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాజ్‌కుమార్ హిరానీ ఎప్పుడూ యాక్షన్ సినిమాలు చేయలేదు. ఆయన క్లాస్ కథలు తెరకెక్కించడంలో దిట్ట.

బాలీవుడ్ కింగ్ ఖాన్ గత ఏడాది ఏకంగా మూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పఠాన్, జవాన్, డంకీ సినిమాతో ఆడియన్స్ ను అలరించాడు షారుఖ్ ఖాన్. పఠాన్, జవాన్ సినిమాలు భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. కానీ డంకి సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్స్ కూడా అంతగా రాలేదు. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్లు వరకు వసూల్ చేశాయి. అందుకే ‘డంకీ’ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాజ్‌కుమార్ హిరానీ ఎప్పుడూ యాక్షన్ సినిమాలు చేయలేదు. ఆయన క్లాస్ కథలు తెరకెక్కించడంలో దిట్ట. ‘డంకీ’ ట్రైలర్ చూసిన చాలా మందికి ఇది క్లాస్ సినిమా అని ఫిక్స్ అయ్యారు. ‘డంకీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. దీనిపై రాజ్‌కుమార్ హిరానీ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తక్కువ కలెక్షన్స్ వస్తాయని తనకు ముందే తెలుసని చెప్పారు.
‘డంకీ’ సినిమా 150 కోట్లలకు పైగా వసూళ్లు సాధించింది. షారుఖ్ లాంటి స్టార్ హీరోకి ఈ కలెక్షన్ తక్కువనే చెప్పాలి. దీనిపై తాజాగా రాజ్‌కుమార్ హిరానీని మాట్లాడారు. వసూళ్ల విషయంలో షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
రెండు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత షారుఖ్ ఖాన్ డుంకీ చేయాలనుకున్నాడు. ఇలాంటి సినిమా తీయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు యాక్షన్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడతారని షారుఖ్ ఖాన్‌కు తెలుసు. కాబట్టి డంకీ గురించి బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి ఆశించవద్దని ఆయన నాకు చెబుతూనే ఉన్నారు. సినిమా మెల్లమెల్లగా వసూళ్లు సాధిస్తుందని ఆయనకు తెలుసు.ఆయన చెప్పినట్లే జరిగింది. కుటుంబ సమేతంగా సినిమా చూసేందుకు వస్తున్నారు’ అని రాజ్ కుమార్ హిరానీ అన్నారు. ‘మున్నా భాయ్ ఎంబీబీఎస్’ చిత్రానికి షారుఖ్ ఖాన్ తో చేయాల్సి ఉంది. కానీ అదివర్కౌట్ కాలేదు. సినిమా చేయడానికి అంగీకరించనప్పటికీ, షారుక్ ఖాన్ సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులను సూచించాడు. ఇది సినిమాకు ఉపయోగపడిందని, అందుకే ఆయనతో సినిమా చేయలేదని రాజ్‌కుమార్ హిరానీ తెలిపారు.
In this journey of friendship, dreams and love… heartbreak opens a new chapter for Hardy & Manu. #DunkiDrop7 – #MainTeraRastaDekhunga Song Out Now!https://t.co/H6ZfOafDJm
Watch #Dunki – In Cinemas Now! pic.twitter.com/ynjHv3TAjd
— Rajkumar Hirani (@RajkumarHirani) December 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
