Taraka Ratna: ఇదే మన ఆఖరి ఫొటో అంటే నమ్మలేకపోతున్నా.. కన్నీళ్లు తెప్పిస్తోన్న తారకరత్నసతీమణి ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. యావత్ సినీ ప్రపంచంతో పాటు నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయాయి.

నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. యావత్ సినీ ప్రపంచంతో పాటు నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయాయి. ఇక తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి అయితే ఈ విషాదం నుంచి ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఆమెను తిరిగి మామూలు మనిషిని చేయాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆమె మాత్రం భర్త జ్ఞాపకాలతో మానసికంగా కృంగిపోతోంది. తాజాగా తన భర్త, పిల్లలతో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి మరోసారి భావోద్వేగానికి గురైంది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదట తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న అలేఖ్య.. ‘ఇదే మా చివరి ఫోటో, చివరి ప్రయాణం అని నమ్మడం నా హృదయం పగిలినట్లు ఉంది. ‘నన్ను మా అమ్మా బంగారు’ అని పిలిచే మీ స్వరం మరోసారి వినాలని ఉంది’ అని ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తారకరత్న అభిమానులు, నెటిజన్లు అలేఖ్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.’మీరు ధైర్యంగా ఉండండి మేడమ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు. అయితే ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచాడు. ఇటీవల ఆయన చిన్మకర్మను నిర్వహించారు. ఇక మార్చి 2న హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో తారకరత్న పెద్దకర్మను నిర్వహించనున్నారు. నందమూరి బాలకృష్ణ, విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.




View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..