Actor Sri: ఈ యంగ్ హీరోకు ఏమైంది..? బక్కచిక్కి.. గుర్తుపట్టలేనంతగా మారిపోయి.. చివరకు ఇలా..
అతి తక్కువ సమయంలోనే తమిళ చిత్రపరిశ్రమలో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకటి రెండు చిత్రాలతోనే తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. కానీ గత రెండేళ్లుగా ఒక్క సినిమా చేయలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు బక్కిచిక్కిపోయి.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ప్రస్తుతం అతడి వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

తమిళ చిత్రపరిశ్రమలో యంగ్ హీరోగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు శ్రీ. విజయ్ టీవీలో ప్రసారమయ్యే కనా కానుమ్ కలాంగల్ అనే టీవీ సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత దర్శకుడు బాలాజీ శక్తివేల్ తెరకెక్కించిన కేస్ నంబర్ 18/9తో నటుడిగా అరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఓనైయుమ్ ఆట్కుట్టియుమ్‌లో ప్రధాన పాత్ర పోషించి మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. అలాగే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మానగరం సినిమాతో హీరోగా మరో హిట్టు అందుకున్నాడు. అతడు నటించిన అనేక చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. వాస్తవికంగా నటించగల వ్యక్తిగా అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. కానీ ఆ తర్వాత అతడికి నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోయాయి.
శ్రీ నటించిన ఇరుగప్పట్రు చిత్రం 2023లో విడుదలైంది. ఈ చిత్రానికి యువరాజ్ దయాళన్ దర్శకత్వం వహించారు. శ్రీతో పాటు విక్రమ్ ప్రభు, సానియా అయ్యప్పన్, శ్రద్ధా శ్రీనాథ్, విధార్థ్, అపర్ణిధి కీలకపాత్రలు పోషించారు. ఆ సినిమా కూడా విజయం సాధించింది. కానీ ఆ మూవీ విడుదలై దాదాపు 2 సంవత్సరాలు గడిచినా అతనికి ఎలాంటి అవకాశాలు రాలేదు. 2017లో బిగ్ బాస్ మొదటి సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ.. వ్యక్తిగత కారణాలతో ఒక్క రోజులోనే ఆ షో నుంచి బయటకు వచ్చాడు. తనకు మానసిక సమస్యలు ఉన్నాయని ఆ షోలో చెప్పుకొచ్చాడు శ్రీ. ఆ తర్వాత అతడి నుంచి మరో సినిమా రాలేదు.
కానీ ఇప్పుడు నటుడు శ్రీ చాలా దయనీయ స్థితిలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చాలా కాలం తర్వాత ఆ యంగ్ హీరోను ఇలాంటి దయనీయ పరిస్థితిలో చూసి ఆందోళనకు గురయ్యారు అతడి అభిమానులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అతడి ఫోటోస్, వీడియోస్ చూస్తుంటే శ్రీకి మానసిక సమస్యలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తోపాటు మిగతా నటీనటులు అతడికి సాయం చేయాలని కోరుతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :