AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులో ఓకే.. కానీ తమిళంలో ‘సైరా’ కష్టమే..!!

ఈ నెల ఫస్ట్ వీక్‌లో తమిళ బాక్సాఫీస్ వద్ద సినిమాలు పందెంకోళ్లలా పోటీ పడబోతున్నాయి . అరవ ప్రేక్షకులకు నిండైన వినోదాన్ని పంచడానికి మూడు చిత్రాలు విడుదలవుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’గా ఈ నెల రెండో తేదీన తెరపైకి వస్తోంది. వెట్రిమారన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అసురన్‌’… జీవీ ప్రకాశ్‌ నటించిన ‘100% కాదల్‌’ 4వ తేదీన విడుదల అవుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘సైరా’ చిత్రాన్ని ప్యాన్‌ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. […]

తెలుగులో ఓకే.. కానీ తమిళంలో 'సైరా' కష్టమే..!!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 02, 2019 | 3:32 PM

Share

ఈ నెల ఫస్ట్ వీక్‌లో తమిళ బాక్సాఫీస్ వద్ద సినిమాలు పందెంకోళ్లలా పోటీ పడబోతున్నాయి . అరవ ప్రేక్షకులకు నిండైన వినోదాన్ని పంచడానికి మూడు చిత్రాలు విడుదలవుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’గా ఈ నెల రెండో తేదీన తెరపైకి వస్తోంది. వెట్రిమారన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అసురన్‌’… జీవీ ప్రకాశ్‌ నటించిన ‘100% కాదల్‌’ 4వ తేదీన విడుదల అవుతున్నాయి.

భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘సైరా’ చిత్రాన్ని ప్యాన్‌ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి అన్ని రాష్ట్రాలకు వెళ్లి సినిమా ప్రమోషన్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తమిళంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. మెగాస్టార్‌తో పాటు అమితాబ్‌బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, తమన్నా, సుదీప్‌లు ఉన్నందున తమిళంలో కూడా సైరాకు మంచి బజ్ ఉంది.

ఇదిలా ఉండగా, ‘అసురన్‌’లో భిన్నమైన గెటప్‌లో నటించిన ధనుష్‌ జాతీయ అవార్డుపై దృష్టి పెట్టిపెట్టినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నాలుగో తేదీన విడుదల చేయనున్నట్లు నెల క్రితమే ప్రకటించారు. 500పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతున్నట్లు సమాచారం. వెట్రిమారన్‌, ధనుష్‌ కాంబినేషన్‌ అంటేనే తప్పకుండా వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు ఎదురు చూస్తారు. ఇక తమిళ్ వాళ్లకి లోకల్ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అందుకే అవార్డు ఓరియంటడ్ మూవీగా భావిస్తున్న అసురన్‌ను హైప్ చెయ్యడానికి సైరాను సైడ్ చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇక తెలుగులో విజయం సాధించిన ‘100% లవ్‌’ చిత్రాన్నే ‘100% కాదల్‌’ పేరుతో తమిళ్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో నటించిన జీవీ ప్రకాశ్‌ యువతలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో. మరి తమిళ సినీ ప్రేమికులు తమ రెండు సొంత చిత్రాలతో పాటుగా సైరాను హిట్ చేస్తారా? లేక పర్సనల్‌గా తీస్కోని పక్కకి పడేస్తారో చూడాలి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం