AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం అమలుకు లైన్ క్లియర్.. త్వరలోనే ప్రారంభం.. రూ.25 లక్షల వరకు లబ్ది..

ఏపీ ప్రభుత్వం త్వరలో మరో పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అదే విదేశీ విద్య పథకం. ఈ పథకం ద్వారా విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థులకు రూ.25 లక్షల సాయం అందించనుంది. అన్ని వర్గాల్లోని పేద విద్యార్థులకు ఈ పథకం వర్తింపచేయనుంది.

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం అమలుకు లైన్ క్లియర్.. త్వరలోనే ప్రారంభం.. రూ.25 లక్షల వరకు లబ్ది..
Andhra Pradesh
Venkatrao Lella
|

Updated on: Jun 11, 2026 | 2:48 PM

Share

ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్దమైంది. విదేశీ విద్యా పథకాన్ని త్వరలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ స్కీమ్ అమలు కోసం త్వరలోనే విధివిధానాలను ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. బీపీఎల్ పరిధిలోని అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో కాకుండా అందరికీ లబ్ది జరిగేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ విడదుల చేస్తామన్నారు. ఎస్సీ విద్యార్థులకే కాకుండా అన్ని వర్గాల్లోని పేద విద్యార్థులకు లబ్ది జరిగేలా ఈ పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పధకం ఎవరికి..?

విదేశాల్లో చదువుకోవాలనునే విద్యార్ధుల కోసం ఈ పథకం అమలు చేస్తున్నారు. విదేశీ విద్య ఖర్చుతో కూడుకున్నది. రూ.లక్షల్లో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించనుంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ వర్గాల్లోని పేద విద్యార్థులకు సాయం అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షల వరకు ఆర్ధిక సాయం అందించనుండగా.. బీసీ, మైనార్టీలకు రూ.20 లక్షలు ఇస్తారు. ఇక కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.15 లక్షలు అందించనున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదనంగా మరో రూ.5 లక్షలు అందించాలన ప్రభుత్వం చూస్తోంది. నిర్వహణ ఖర్చుల కోసం వీటిని అందించనున్నారు.

ఏయే కోర్సులకు అందిస్తారంటే..?

పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ వంటి కోర్సులను విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థులకు సాయం అందిస్తారు. గతంలో ఎన్టీఆర్ విదేశీ విద్య, అంబేద్కర్ పేర్లతో ఈ పథకాన్ని టీడీపీ అమలు చేయగా.. వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పేరుతో అమలు చేస్తారు. ఇందులో భాగంగా క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో టాప్-50 వర్సిటీల్లో సబ్జెక్టుల వారీగా అడ్మిషన్లు పొందినవారికి వర్తింపచేశారు. కానీ ఇప్పుడు టాప్ -250 వర్సిటీల్లో అడ్మిషన్లు పొందినవారికి సాయం అందించనున్నారు. ఈ మేరకు పథకంలో కూటమి ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. త్వలరలో విడుదల చేయనున్న విధివిధానాల్లో పూర్తి స్పష్టత ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు కూాాడా విదేశీ విద్య అభ్యసించనున్నారు. విదేశాల్లో చదువుకోవాలంటే కేవలం ధనవంతులే కాదు.. పేదలు కూాడా ఈ పథకం ద్వారా చదువుకోవచ్చు.

Follow Us
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్