వేసవిలో పుచ్చకాయ రుచితో పాటు పోషకాలు అందిస్తుంది. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, పుచ్చగింజలు కూడా ఎన్నో మేలైన పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రక్తపోటును నియంత్రిస్తాయి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. పురుషుల్లో వీర్య కణాల వృద్ధికి దోహదం చేస్తాయి.