AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan-Allu Arjun: పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. బుధవారం (జూన్ 10) రాత్రి పవన్ కల్యాణ్ ఇంటికెళ్లిన బన్నీ ఆయనను పరామర్శించారు. డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి అన్ని విషయాలు అడిగి తెలసుకున్నారు.

Pawan Kalyan-Allu Arjun: పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
Pawan Kalyan, Allu Arjun
Basha Shek
|

Updated on: Jun 11, 2026 | 1:18 PM

Share

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఇటీవలే సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోన్న ఆయన ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నారు. మరీ ముఖ్యమైన కార్యక్రమాలుంటే తప్పితే పవన్ బయటకు రావడం లేదు. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవర్ స్టార్ ఇంటికెళ్లి ఆయనను పరామర్శిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించినట్లు తెలుస్తోంది. పవన్ హెల్త్ కండిషన్ తో పాటు ఫ్యామిలీ విషయాల గురించి కూడా ఇద్దరు చర్చించుకున్నారని సమాచారం. మరోవైపు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ జరుగుతోంది. మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లేనని మెగా, అల్లు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాల్లేవని ఇరు కుటుంబాల సన్నిహితులు చెబుతున్నారు. అలాగే మెగా, అల్లు హీరోలు కూడా ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరి సినిమాల గురించి మరొకరు ట్వీట్స్, పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ ను పరామర్శించారు. మరి ఇప్పుడైనా ఈ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ కు ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.

కాగా పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇప్పుడు సినిమాకలు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా పూర్తిగా ఏపీ పరిపాలనపైనే దృష్టి సారించారు. మరోవైపు అల్లు అర్జున్ తన సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో రాకా అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 800 కోట్లతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు బన్నీ. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుల గురించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us