AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఇలా కూడా మోసం చేస్తారా? గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే షాక్

బంగారం ధర పెరిగేకొద్దీ రకరకాల మోసాలు పుట్టుకొస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ బంగారం పేరుతో జరిగిన మోసం చూస్తే షాక్ అవ్వాల్సిందే. బంగారానికి మెరుగు పెడతామని, కళకళలాడుతుందని చెప్పి మహిళలను మోసగించిన సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగింది. స్థానిక కొండపేటలో గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరు మహిళలను క్షణాల్లో బురిడీ కొట్టించి నాలుగున్నర తులాల బంగారాన్ని అపహరించాడు. అసలేం జరిగిందంటే..

Andhra News: ఇలా కూడా మోసం చేస్తారా? గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే షాక్
Gold Polishing Fraud In Kurnool
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jun 11, 2026 | 3:05 PM

Share

కర్నూలు, జూన్‌ 11: కొండపేటకు చెందిన పద్మావతి, చంద్రకళ లు వరుసకు వదిన మరదలు. బుధవారం మధ్యాహ్నం వీరంతా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా ఓ కేటుగాడు ఇంటి వద్దకు వచ్చి “కంపెనీ ప్రచార నిమిత్తం వచ్చాం బంగారు వెండి ఆభరణాలు ఇస్తే మీ ముందే ఫ్రీగా మెరుగు పెట్టించి తల తల మెరిసేలా చేస్తాం” అంటూ నమ్మబలికాడు.

అయితే ఆ మహిళలు మొదట తమకు వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఆ కేటుగాడు మీ కళ్ళ ముందే మెరుగు పెట్టి ఇస్తానంటూ పదేపదే చెప్పడంతో చంద్రకళ తన వెండి పట్టి ఇవ్వగా మెరుగు పెట్టి ఇచ్చాడు. దీంతో నమ్మకం కుదిరిన ఆమె తన మెడలోని రెండున్నర తులాల తాళి చైన్ మెరుగుపట్టేందుకు ఇచ్చింది. ఆ కేటుగాడు చంద్రకళ తాళి చైన్ కు మెరుగుపడుతూనే.. పక్కనే ఉన్న పద్మావతి మహిళకు చెందిన రెండు తులాల తాళి చైన్ కూడా పెరుగుపడతానంటూ ఇప్పించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో కొద్దిసేపు వివిధ రకాల కెమికల్స్ పౌడర్లు కలిపి తాళి చైన్లకు మెరుగు పెడుతున్నట్లుగా ఆ దుండగుడు నటించాడు. అనంతరం ఆ తాళి చైన్లను వారి ముందరే పసుపు రంగు ద్రావణంలో వేసి కొద్ది సమయం తర్వాత తీసుకోవాలని చెప్పి ఆ కేటుగాడు అక్కడి నుంచి ఉదయించాడు. కొద్ది సమయం తర్వాత తాళి చైన్లను పసుపు నీటి ద్రావణంలో చూసిన ఆ మహిళలు ఖంగు తిన్నారు. రెండు తాళి చైన్ల పరిమాణం సగానికి పైగా తగ్గిపోవడంతో పాటు బంగారు చైన్లు తంటలు తుంటలుగా ఉండటంతో మోసం జరిగిందని తెలుసుకుని లబోదిబోమంటూ ఆ మహిళలు కోడుమూరు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం