వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
నంద్యాల పాత పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో లిఫ్ట్ ఒక్కసారిగా జారిపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని బేతంచెర్లకు చెందిన శారదగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం లిఫ్ట్‌లో కిందకు వస్తుండగా సాంకేతిక లోపంతో అది ఒక్కసారిగా కిందకు జారి పడిపోయింది. ఆ తర్వాత..

కర్నూలు, జూన్ 11: నంద్యాల పాత పట్టణంలోని అమ్మవారి శాల వద్ద ఉన్న వాసవి కళ్యాణ మండపం లిఫ్ట్ ఒక్కసారిగా జారి పడటంతో అందులో ఉన్న ఓ మహిళ మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల కు చెందిన శారద.. కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం కళ్యాణమండపం లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం కిందకు వచ్చే సమయంలో లిఫ్టులో సాంకేతిక లోపం తలెత్తి ఒక్కసారిగా కిందకు జారిపడి మధ్యలో నిలిచిపోయింది. లిఫ్ట్ తలుపులు తెరుచుకోవడంతో శారద తీవ్ర అస్వస్థతకు గురైంది.
నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలీ భర్త హరి ఫిర్యాదు మేరకు నంద్యాల వన్ టౌన్ పోలీసులు కళ్యాణ మండపం నిర్వాహకుడు తో పాటు కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు. చూశారుగా.. నిత్యం ఏదో ఒక సమయంలో లిఫ్ట్తో మనకు అవసరం ఉంటుంది. ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ సరిగా ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
