విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC సీరియస్ అయింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన NHRC రాష్ట్ర సీఎస్ జి సాయి ప్రసాదన్‌కు నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు వారాల్లో పూర్తి నివేదికను సమర్పిచాలని ఆదేశించింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ భారీ ప్రమాదం సంభవించి సుమారు 8 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించగా మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తాజాగా ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను స్పందించింది. సోషల్ మీడియా, న్యూపేపర్‌లో వచ్చిన కథనాల ఆధారంగా ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్ ఆంధ్రప్రదేశ్ సీఎస్ జి సాయి ప్రసాదన్‌కు తాజాగా నోటీసులు జారీ చేసింది.
నోటీసులు NHRC కీలక విషయాలను పేర్కొంది. ప్రమాద ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్టీల్ ప్లాంట్‌లోని భద్రతా లోపాలపై పూర్తి వివరాలు సమర్పించాలని కోరింది. ప్రమాదంలో గాయపడిన కార్మికుల పరిస్థితిపై ఆరా తీసింది. అలాగే ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందించారు. దానికి సంబంధించిన పూర్తి విరాలను కూడా నివేదికలో సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.
ప్రమాదం ఎలా జరిగింది.
జూన్ 8వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-2 విభాగంలో లాడిల్ నుండి ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఒక్కసారిగా దాన్ని క్యారీ చేస్తున్న భారీ బకెట్ తెగి అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక వెంటనే సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు.
అయితే ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించింది. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
