Actor Karthik: ‘అభినందన’ మూవీ హీరో గుర్తున్నాడా? పాపం ఇప్పుడెలా మారిపోయారో చూశారా? కనీసం నడవలేని స్థితిలో..
దివంగత దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన సీతాకోక చిలుక సినిమాలో హీరోగా నటించారు కార్తీక్. ఈ నేపథ్యంలో తనను హీరోగా పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడిని కడసారి చూసేందుకు కార్తీక్ కూడా వచ్చారు. కానీ ఆయనను చూసి చాలా మంది గుర్తు పట్టలేకపోయారు.

బుధవారం(జూన్ 10) కన్నుమూసిన లెజెండరీ దర్శకుడు భారతీరాజాను కడసారి చూసేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. సీఎం విజయ్, స్టాలిన్, రజనీకాంత్, సూర్య, రాధిక ఇలా ఎందరో స్టార్స్ భారతీరాజా నివాసానికి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఇదే క్రమంలో ఇదే దర్శకుడు తెరకెక్కించిన సీతాకోక చిలుక సినిమాలో నటించిన హీరో కార్తీక్ కూడా వచ్చారు. తనను కథానాయకుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన భారతీరాజాను కడసారి చూసేందుకు వచ్చారు. అయితే ఒకప్పుడు లవర్ బాయ్ గా, స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ ప్రస్తుతం గుర్తు పట్టలేకుండా మారిపోయారు. ఆయన ఎంతో కష్టపడుతూ, కుంటుతూ భారతీరాజా భౌతికకాయం దగ్గరకు రావడం చూసి చాలామంది షాక్ కి గురయ్యారు. కార్తీక్ సార్.. ఇలా మారిపోయారేంటి? అని అందరూ మాట్లాడుకున్నారు.
ప్రస్తుతం కార్తీక్ వయసు సుమారు 65 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలకు తోడు అయన గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఆయన అసలు బయటకు కూడా రావడం లేదు. సినిమాలు కూడా పూర్తిగా పక్కన పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ఇలా ఇప్పుడే మీడియా ముందుకు వచ్చారు కార్తీక్. కానీ ఇప్పుడు ఆయనను ఈ స్థితిలో చూసి సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కార్తీక్ త్వరగా కోలుకోని మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.
భారతీరాజా ఇంటి వద్ద హీరో కార్తీక్.. వీడియో..
It’s hard to see our 90s heroes getting older🥲 Actor Karthik pays his respects at Bharathiraja Sir’s funeral pic.twitter.com/nCKKgVMVUH
— 𝗟𝗼𝗴𝗮𝗻♬ (@vasloga) June 10, 2026
సీతాకోక చిలుక సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొన్నారు. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు.’అన్వేషణ’, ‘అభినందన’, ‘ఘర్షణ’, ‘గోపాలరావు గారి అబ్బాయి’,.. ఇలా చెప్పుకుంటూ పోతే కార్తీక్ కెరీర్ లో ఎన్నో క్లాసిక్ సినిమాలున్నాయి. కేవలం హీరోగానే కాకుండా ఓమ్ 3డీ, అనేగన్ వంటి సినిమాల్లో విలన్ గా కూడా చేశారు కార్తీక్. తెలుగులో చివరిగా 2013లో ఓమ్ 3డీ సినిమాలో కనిపించారు కార్తీక్. ఇక 2019 తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.
ఇక కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ కూడా ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. అలాగే కార్తీక్ కోడలు, గౌతమ్ భార్య మంజిమా మోహన్ కూడా హీరోయిన్ గా చేస్తోంది. అక్కినేని నాగచైతన్య నటించిన ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమాలో మంజిమా హీరోయిన్ గా నటించింది.
భారతీరాజా భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్..
View this post on Instagram
కార్తీక్ కుమారుడు, కోడలు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




