Leo Movie: దళపతి విజయ్‌కు షాకిచ్చిన తమిళనాడు సర్కార్.. లియో అదనపు షోస్ రద్దు.. ఫ్యాన్స్ ఆగ్రహం
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన 'లియో' చిత్రం అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగిందని, రిలీజ్ రోజున ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని సినీ వ్యాపార విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే 'లియో' చిత్రానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే తెలుగు వెర్షన్ రిలీజ్ కు సంబంధించి వివాదాలు నడుస్తున్నాయి.

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘లియో’ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగిందని, రిలీజ్ రోజున ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని సినీ వ్యాపార విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ‘లియో’ చిత్రానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే తెలుగు వెర్షన్ రిలీజ్ కు సంబంధించి వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు విజయ్ సినిమాకు తమిళనాడులోనే కాస్త ఎదురుదెబ్బ తగిలింది. లియో అదనపు షోల కోసం నిర్మాణ సంస్థ పంపిన అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. వివరాల్లోకి వెళితే.. ‘లియో’ సినిమాని ఉదయం 4 గంటలకు, 7 గంటలకు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ‘లియో’ చిత్ర నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వం ఈ అభ్యర్థనను ఆమోదించించినా.. 4, 7 గంటల షోకు మాత్రం అంగీకారం తెలపలేదు. మొదటి షో ఉదయం 9 గంటలకు ప్రదర్శించాలని, చివరి షో 1 గంటలకు ముగించాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. కాగా లియో అదనపు షోల కోసం నిర్మాణ సంస్థ అనుమతి కోసం మద్రాసు హైకోర్టులో దరఖాస్తు కూడా చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోవడంతో 4 గంటల షో కుదరదని, 7 గంటల షోకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందో లేదో పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే 4, 7 గంటల షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. భద్రతా కారణాల రీత్యా మార్నింగ్ షోలకు అనుమతించలేదని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ‘
లియో’ సినిమా నిర్మాణ సంస్థ సెవెన్ స్టూడియోస్ రెండు స్పెషల్ షోలు వేయాలని అభ్యర్థించింది. అక్టోబర్ 19న ఉదయం 4, 7 గంటలకు రెండు షోలు, అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు ఉదయం 7 గంటల షోలు ప్రదర్శించేందుకు అనుమతి కోరారు. అయితే నిర్మాణ సంస్థ అభ్యర్థనను తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే 4 గంటలు, 7 గంటల షోలకు అనుమతి కోసం ‘లియో’ చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇవాళ కూడా నిర్మాణ సంస్థ సిబ్బంది ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులను కలుస్తూ మాట్లాడుతున్నారు. అయితే చర్చలు ఫలించలేదు. బుక్ మై షో సమాచారం ప్రకారం చెన్నైలో ఉదయం 9 గంటలకు ‘లియో’ సినిమా ఫస్ట్ షోలు ప్రారంభమవుతున్నాయి. థియేటర్లు లేదా మల్టీప్లెక్స్‌లు ఏవీ రాత్రి 9 గంటలలోపు షోలను ప్రదర్శించడం లేదు. ‘లియో’ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా U/A సర్టిఫికేట్ పొందింది మరియు ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. దశాబ్ద కాలం తర్వాత ఈ జంట తెరను పంచుకోనుంది. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ విలన్‌గా నటించారు. అర్జున్ సర్జా కూడా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..