Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Martin Luther King: సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా ‘మార్టిన్ లూథర్ కింగ్’ ట్రైలర్ రిలీజ్..

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. పొలిటికల్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఊరికి దక్షిణాన ఉన్న వాళ్లు సౌత్ గ్రూప్‏గా.. ఉత్తరాన ఉన్నవాళ్లు నార్త్ గ్రూప్‏గా విడిపోయి నిత్యం గొడవపడుతుంటారు. ఈ మధ్యలో పంచాయతీ ఎన్నికలు రావడం.. నార్త్ నుంచి నరేష్.. సౌత్ నుంచి ఒకరు ఎన్నికల పోటిలోకి దిగుతారు. ఊరిలో అన్ని ఓట్లు సమానంగా అటు ఇటు సరిపోగా.. సంపూర్ణేష్ బాబుకు కీలకంగా మారనుందని ట్రైలర్ చేస్తే అర్ధమవుతుంది.

Martin Luther King: సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా 'మార్టిన్ లూథర్ కింగ్' ట్రైలర్ రిలీజ్..
Martin Luther King Trailer
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2023 | 7:28 PM

పేరడీ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘మార్టిన్ లూథర్ కింగ్’. తమిళ్ హిట్ మూవీ ‘మండేలా’కీ రీమేక్ గా తెరకెక్కుతుంది. తమిళంలో కమెడియన్ యోగిబాబు హీరోగా నటించారు. ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్న మార్టిన్ లూథర్ కింగ్ సినిమాకు డైరెక్టర్ పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నరేష్, డైరెక్ట్ర వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి స్మరన్ సాయి సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. పొలిటికల్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఊరికి దక్షిణాన ఉన్న వాళ్లు సౌత్ గ్రూప్‏గా.. ఉత్తరాన ఉన్నవాళ్లు నార్త్ గ్రూప్‏గా విడిపోయి నిత్యం గొడవపడుతుంటారు. ఈ మధ్యలో పంచాయతీ ఎన్నికలు రావడం.. నార్త్ నుంచి నరేష్.. సౌత్ నుంచి ఒకరు ఎన్నికల పోటిలోకి దిగుతారు. ఊరిలో అన్ని ఓట్లు సమానంగా అటు ఇటు సరిపోగా.. సంపూర్ణేష్ బాబుకు కీలకంగా మారనుందని ట్రైలర్ చేస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ చూస్తే ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమాను YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహాయానా మోషన్ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో ఈసినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాతో పూజా కొల్లూరు దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.