AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jwala Gutta-Vishnu Vishal: త్వరలోనే మేము పెళ్లి చేసుకొబోతున్నాం.. క్లారిటీ ఇచ్చిన గుత్తా జ్వాలా ప్రియుడు..

గుత్తా జ్వాలా తమిళ యువహీరో విష్ణు విశాల్ ను వివాహం చేసుకోనున్నారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో తేలిపోతున్న

Jwala Gutta-Vishnu Vishal: త్వరలోనే మేము పెళ్లి చేసుకొబోతున్నాం.. క్లారిటీ ఇచ్చిన గుత్తా జ్వాలా ప్రియుడు..
Tamil Actor Vishnu Vishal
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2021 | 10:53 AM

Share

Jwala Gutta -Vishnu Vishal: గుత్తా జ్వాలా తమిళ యువహీరో విష్ణు విశాల్ ను వివాహం చేసుకోనున్నారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో తేలిపోతున్న ఈ జంట త్వరలో పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారని తెలుస్తుంది. . ఇప్పటికే ఈ  ఇద్దరి ప్రేమప్రయాణం పై మీడియాలో చాలా కథనాలు కూడా వచ్చాయి. ఇక 2021 లో ముహుర్తాలు చూసుకొని ఈ ప్రేమపావురాలు ఒక్కటవ్వబోతున్నారని ఆ మధ్య టాక్ కూడా నడిచింది. ఇప్పటికే విష్ణు విశాల్ మొదటి భార్యనుంచి విడాకులు తీసుకొని పెళ్ళికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. అటు గుత్తా జ్వాలకు కూడా ఇది రెండో పెళ్లి. తాజాగా మరో సారి ఈ ఇద్దరి పెళ్లి టాపిక్ మరో సారి తెరపైకి వచ్చింది.

ఇక ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఈ విషయాన్నీ విష్ణు విశాల్ స్వయంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన అరణ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. “అరణ్య షూటింగ్ సమయంలో జ్వాలా గుత్తా నాకు చాలా హెల్ప్ చేసింది. షూటింగ్ స్పాట్ లోనూ నాతోనే ఉంది. మేము వివాహం చేసుకోబోతున్నాం. త్వరలో పెళ్లితేదీని ప్రకటిస్తాం. నేను త్వరలో తెలుగింటి అల్లుడు కాబోతునున్నాను” అని చెప్పుకొచ్చాడు విష్ణు విశాల్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vakeel Saab: పేపర్స్ చింపేయాలి అనేంత మాస్ సినిమాలో ఉంది.. రేపు థియేటర్లో మీరంతా ఇంకా ఎంజాయ్ చేస్తారు

Sarkaru Vaari Paata : మహేష్ కు తండ్రిగా మలయాళ నటుడు.. సర్కారు వారిపాట సినిమాలో జయ్ రామ్