Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonakshi Sinha : బంపర్ ఆఫర్ అంటే ఇదే.. ఇద్దరు టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలో అవకాశం దక్కించుకున్న బాలీవుడ్ బ్యూటీ..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

Sonakshi Sinha : బంపర్ ఆఫర్ అంటే ఇదే..  ఇద్దరు టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలో అవకాశం దక్కించుకున్న బాలీవుడ్ బ్యూటీ..
Sonakshi Sinha
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 22, 2021 | 8:34 AM

Sonakshi Sinha:  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో మెగాస్టార్ కు జోడీగా అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతోపాటు వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. అయితే ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ కుర్రదర్శకుడు, విక్టరీ వెంకటేష్,నాగచైతన్యలతో వెంకీమామ, జూనియర్ ఎన్టీఆర్ తో జైలవకుశ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే మెగాస్టార్ కోసం అద్భుతమైన కథను సిద్దమా చేసే పనిలో ఉన్నాడు బాబీ. అయితే ఈ సినిమాలో చిరు సరసన బాలీవుడ్ భామ అయితే బావుంటుందని భావించిన బాబీ. ఓ స్టార్ హీరోయిన్ ను సంప్రదించాడట.

ఆ అమ్మడు ఎవరో కాదు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకొని.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సోనాక్షి సిన్హా. మెగాస్టార్ కు జోడీగా సోనాక్షి సరిగ్గా సెట్ అవుతుందని బాబీ ఆమెను సంప్రదించాడట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీకి ఇప్పుడు మరో తెలుగు సినిమాలో కూడా అవకాశం వచ్చిందని తెలుస్తుంది. ఈ సారి ఈ అమ్మడికి నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఆఫర్ తలుపుతట్టిందట.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరవాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇటీవల క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు గోపీచంద్. ఈ సినిమాలో కూడా సోనాక్షి సిన్హా ను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేస్తున్నారని టాక్ . ఇలా ఒకే సారి ఈ బాలీవుడ్ బ్యూటీ కి టాలీవుడ్ టాప్ హీరోలు ఛాన్స్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ రెండు సినిమాలను సోనాక్షి ఓకే చేస్తుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Seetimaarr Movie: “నా పేరే పెప్సీ ఆంటీ..” అంటూ చిందులేసిన అప్సరారాణి.. ‘సీటీమార్’ నుంచి మాస్ మసాలా సాంగ్

Rang De Movie: ఆ అదృష్టం మనిషికి మాత్రమే ఉంది.. ‘రంగ్‌ దే’ జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది: త్రివిక్రమ్