AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seetimaarr Movie: “నా పేరే పెప్సీ ఆంటీ..” అంటూ చిందులేసిన అప్సరారాణి.. ‘సీటీమార్’ నుంచి మాస్ మసాలా సాంగ్

టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచో స్టార్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Seetimaarr Movie: నా పేరే పెప్సీ ఆంటీ.. అంటూ చిందులేసిన అప్సరారాణి.. 'సీటీమార్' నుంచి మాస్ మసాలా సాంగ్
Seetimaarr Song
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2021 | 7:41 AM

Share

Seetimaarr Movie: టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచో స్టార్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సీటిమార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ఇది. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మెలొడిబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌లైన జ్వాలా రెడ్డి సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ మూవీ నుండి హాట్ బ్యూటీ అప్స‌రా రాణి స్పెష‌ల్ సాంగ్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్ . `నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్లికి నేనే యాంటీ` లిరిక‌ల్ సాంగ్‌ని ఇటీవల విడుద‌ల చేసింది చిత్ర యూనిట్.

`నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్లికి నేనే యాంటీ..  అంటూ సాగే ఈ పాట‌లో యంగ్ బ్యూటీ అప్సర రాణి హాట్ హాట్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. పక్కా మాస్ ఆడియన్స్ ను అలరించేలా మణిశర్మ మాంచి ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేశారు. విపంచి రాసిన ఈ పాట‌ను సింగ‌ర్ కీర్త‌న శర్మ అంతే హుషారుగా ఆల‌పించింది. ఈ సాంగ్ యూత్ అండ్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇక సీటీమార్ సినిమాను ఏప్రిల్ 2న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్‌చేయ‌నున్నారు. మరి ఈ సినిమాతో గోపీచంద్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rang De Movie: ఆ అదృష్టం మనిషికి మాత్రమే ఉంది.. ‘రంగ్‌ దే’ జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది: త్రివిక్రమ్

Saranga Daria: ‘సారంగదరియా’కి స్టెప్పులేసిన మంగ్లీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Follow Us
తిరుమలలో ఈ దర్శనాల గురించి మీకెవరూ చెప్పరు.. ఎన్ని మార్గాలంటే
తిరుమలలో ఈ దర్శనాల గురించి మీకెవరూ చెప్పరు.. ఎన్ని మార్గాలంటే
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.
కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..
కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..
నూనె పీల్చకుండా అదిరిపోయే బలవర్ధకమైన ఉలవ వడలు
నూనె పీల్చకుండా అదిరిపోయే బలవర్ధకమైన ఉలవ వడలు
'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్' సినిమాలో నటించిన ఈ పాప ఎవరో తెలుసా?
'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్' సినిమాలో నటించిన ఈ పాప ఎవరో తెలుసా?
మిక్సీ సరిగ్గా తిరగడం లేదా.. జస్ట్ 2 నిమిషాల్లో ఇలా సెట్ చేయండి..
మిక్సీ సరిగ్గా తిరగడం లేదా.. జస్ట్ 2 నిమిషాల్లో ఇలా సెట్ చేయండి..
పళ్ళు లేని ముసలివాళ్లు కూడా తినేంత దూదిలాంటి ఆరోగ్యమైన రొట్టెలు
పళ్ళు లేని ముసలివాళ్లు కూడా తినేంత దూదిలాంటి ఆరోగ్యమైన రొట్టెలు
షేన్ వార్న్, జంపా రికార్డులు బ్రేక్ చేసిన కుల్దీప్ యాదవ్
షేన్ వార్న్, జంపా రికార్డులు బ్రేక్ చేసిన కుల్దీప్ యాదవ్
కేవలం రూ.299కే ఫోన్.. ఆరు నెలల రీఛార్జ్ ఫ్రీ..
కేవలం రూ.299కే ఫోన్.. ఆరు నెలల రీఛార్జ్ ఫ్రీ..
ఈ గింజలను నానబెట్టి రాస్తే.. జట్టు వద్దన్నా పెరుగుతుందట!
ఈ గింజలను నానబెట్టి రాస్తే.. జట్టు వద్దన్నా పెరుగుతుందట!