Rang De Movie: ఆ అదృష్టం మనిషికి మాత్రమే ఉంది.. ‘రంగ్‌ దే’ జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది: త్రివిక్రమ్

భూమి మీద మనిషికి మాత్రమే అదృష్టం ఉందని.. ఇంకెవరికీ లేదని మాటల మాంత్రికుడు, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జంతువులకు ఏడు రంగులు చూసే అవకాశం లేదని.. ఆ అదృష్టం ఒక్క

Rang De Movie: ఆ అదృష్టం మనిషికి మాత్రమే ఉంది.. 'రంగ్‌ దే' జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది: త్రివిక్రమ్
Rang De Pre Release Event Trivikram Srinivas
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 22, 2021 | 12:03 AM

Rang De Pre Release Event: భూమి మీద మనిషికి మాత్రమే అదృష్టం ఉందని.. ఇంకెవరికీ లేదని మాటల మాంత్రికుడు, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జంతువులకు ఏడు రంగులు చూసే అవకాశం లేదని.. ఆ అదృష్టం ఒక్క మనుషులకు మాత్రమే ఉందంటూ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం జరిగిన ‘రంగ్‌ దే’ చిత్ర ప్రి రిలీజ్‌ వేడుకలో త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నితిన్‌, కీర్తి సురేశ్‌ హీరోహీరోయిన్లుగా రంగ్ దే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ఈ సినిమా జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుందని పేర్కొన్నారు. తాను ఈ సినిమా చూశానని.. బాగా నచ్చిందన్నారు. ఇందులో తనకు బాగా నచ్చిన పాత్రలు అర్జున్‌, అను అని పేర్కొన్నారు. ఎలాంటి సందర్భంలో అయినా ఓ మంచి పాటను తీసుకురాగలిగే సత్తా దేవిశ్రీ ప్రసాద్‌కు ఉందన్నారు. భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో దేవీ కూడా ఒకరంటూ కొనియాడారు. ఈ సినిమాలోని ‘ఊరంతా చీకటి’ పాట థియేటర్‌లో చూస్తే ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతాయంటూ పేర్కొన్నారు. రంగ్ దే సినిమా ఏడు రంగులను చూపిస్తుందని.. అంత బాగా తీశారంటూ పేర్కొన్నారు.

నితిన్‌ మాట్లాడుతూ.. పీసీ శ్రీరామ్‌ డిఓపీ అనగానే ఆయన బాగా చూపిస్తారనే నమ్మకంతో సినిమాను ఒప్పుకున్నానన్నారు. ‘ఇష్క్‌’ తర్వాత ఆయనతో మరోసారి పని చేయడం హ్యాపీగా ఉందన్నారు. ఈ సినిమా హిట్ అవుతుందని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో తనకు పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ రెండు కళ్లలాంటివారని పేర్కొన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘‘నితిన్‌, కీర్తి ఈ కథ అంగీకరిస్తారని అనుకోలేదని.. వారు అర్జున్‌, అను పాత్రలకు ప్రాణం పోశారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్, నితిన్, కీర్తి సురేష్, హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు), నిర్మాతలు సుధాకర్‌రెడ్ది, ఠాగూర్ మధు, సూర్యదేవర నాగవంశీ, చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్‌, చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, నటులు నరేష్‌, రోహిణి, వెన్నెల కిషోర్‌, అభినవ్‌ గోమటం, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, శ్రీమణి, గాయని మంగ్లీ, తదితరులు పాల్గొన్నారు.

Also Read: