Saranga Dariya: ‘సారంగదరియా’కి స్టెప్పులేసిన మంగ్లీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Mangli Dance Performance: నాగ చైతన్యగా హీరోగా.. సాయి పల్లవి హీరోయిన్‌గా సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ‘. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా

Saranga Dariya: ‘సారంగదరియా’కి స్టెప్పులేసిన మంగ్లీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Mangli Dance For Saranga Daria Song
Follow us
Shaik Madar Saheb

| Edited By: Team Veegam

Updated on: Mar 22, 2021 | 12:37 PM

Mangli Dance Performance: నాగ చైతన్యగా హీరోగా.. సాయి పల్లవి హీరోయిన్‌గా సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ‘. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని మాస్ బీట్ సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల ఊర్రుతలూగిస్తోంది. సారంగదరియా అంటూ మంగ్లీ పాడిన పాట ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. సారంగదరియా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండింగ్‌గా మారింది. మంగ్లీ అదిరిపోయే వాయిస్‌కు.. సాయిపల్లవి స్టెప్పులు తోడవ్వడంతో ఈ పాట ట్రెండ్ మాములుగా సాగడం లేదు. ఈ పాట వచ్చిరాగానే వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాట తనదంటూ కోమలి పేర్కొనడం.. దానిపై వివాదం చేలరేగడం ఆ తర్వాత సద్దుమణగడం అంతా తెలిసిందే. తాజాగా ఈ పాట సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలన్నీంటిలో వైరల్‌గా మారింది. చాలామంది ఈ పాటకు డ్యాన్స్ వేస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.

అయితే ఈ పాటకు అద్భుత వాయిస్ అందించిన మంగ్లీ కూడా సారంగదరియాకు స్టెప్పులేసింది. తాను పాడిన పాటకే మంగ్లీ స్టెప్పులేసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఈ సారంగదరియాకు మంగ్లీ స్టేప్పులేయడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. మీరు పాడిన పాటకే మీరే డ్యాన్స్ చేయడం.. పాటకు కొత్తదనం వచ్చినట్టుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ టాలీవుడ్‌లో సారంగదరియా పాట మరింత ఊత్సాహాన్ని నింపిందని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకెందుకు ఆలస్యం మంగ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియోను కూడా చూడండి.

View this post on Instagram

A post shared by Mangli Singer (@iammangli)

Also Read:

Varshini New Photos : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అందాల యాంకరమ్మ.. ఫిదా అవుతున్న నెటిజన్లు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!