Sarkaru Vaari Paata : మహేష్ కు తండ్రిగా మలయాళ నటుడు.. సర్కారు వారిపాట సినిమాలో జయ్ రామ్

సూపర్ స్టార్ ,మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులంతా

Sarkaru Vaari Paata : మహేష్ కు తండ్రిగా మలయాళ నటుడు.. సర్కారు వారిపాట సినిమాలో జయ్ రామ్
Sarkaru Vaari Paata
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 22, 2021 | 9:05 AM

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ ,మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులంతా సర్కారు వారి పాట కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నరు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తుంది.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసినా పోస్టర్స్ లో మహేష్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన మహేష్ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే సర్కారు వారిపాట సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫీలింక్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేష్ కు తండ్రిగా మలయాళ సీనియర్ హీరో జయ్ రామ్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇక జయ్ రామ్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జయ్ రామ్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా ఆయన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక సర్కారు వారిపాట సినిమాలో తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ సీన్స్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడట పరశురామ్. మైత్రీ మూవీ మేకర్స్- జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ -14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అబిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sonakshi Sinha : బంపర్ ఆఫర్ అంటే ఇదే.. ఇద్దరు టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలో అవకాశం దక్కించుకున్న బాలీవుడ్ బ్యూటీ..

Seetimaarr Movie: “నా పేరే పెప్సీ ఆంటీ..” అంటూ చిందులేసిన అప్సరారాణి.. ‘సీటీమార్’ నుంచి మాస్ మసాలా సాంగ్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?