AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayam Ravi: నా పిల్లలను సానుభూతి కోసం వాడుకుంటుంది.. భార్య ఆర్తి ఆరోపణలపై జయం రవి రియాక్షన్..

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న అగ్రహీరోలలో జయం రవి ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరో.. ఇప్పుడు తన పర్సనల్ విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. కొన్నాళ్లుగా జయం రవి, తన భార్య ఆర్తిరవితో విడాకుల వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో జయం రవి, సింగర్ కెన్నిసాతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

Jayam Ravi: నా పిల్లలను సానుభూతి కోసం వాడుకుంటుంది.. భార్య ఆర్తి ఆరోపణలపై జయం రవి రియాక్షన్..
Jayam Ravi
Rajitha Chanti
|

Updated on: May 15, 2025 | 4:25 PM

Share

తమిళ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలలో జయం రవి ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో అలరిస్తున్న ఆయన.. గతేడాది తన భార్య ఆర్తి రవి నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే అదే సమయంలో తన భర్తపై తీవ్ర విమర్శలు చేసింది ఆర్తి రవి. అలాగే ఇటీవల జయం రవి సింగ్ కెనిసాతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే నిర్మాత గణేష్ ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు సింగర్ కెనిసాతో కలిసి జయం రవి హాజరయ్యాడు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత అతడి భార్య ఆర్తి రవి ఇన్ స్టాలో చేసిన పోస్ట్ సైతం తెగ వైరలయ్యింది. తన భర్త పేరు ప్రస్తావించకుండానే అతడిపై తీవ్ర విమర్శలు చేసింది. తాజాగా తన భార్య పోస్టుకు కౌంటరిచ్చారు హీరో జయం రవి. తన వివాహ బంధాన్ని ఎందుకు వదులుకున్నాడో.. కెనిషాతో తన బంధం గురించి క్లారిటీ ఇచ్చారు.

“ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితిలో.. నా జీవితం గురించి ప్రజల అభిప్రాయాలు, రూమర్స్, నిజాలను వక్రీకరిస్తూ వచ్చే వార్తలు చూడడం చాలా బాధాకరం. మానంగా ఉండడం అంటే అది నా అసమర్థత కాదు. నా ప్రశాంతమైన జీవితం కోసమే నేన మౌనంగా ఉన్నాను. నా గురించి ఏమీ తెలియని వ్యక్తులు నా ప్రశాంతతను ప్రశ్నిస్తే నేను మాట్లాడవలసి వస్తుంది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నా సొంత కృషి మాత్రమే కారణం. నా కీర్తిని తమ మటాలతో తగ్గించడానికి ప్రయత్నిస్తే నేను ఎప్పటికీ అనుమతించను. ఇది ఆట కాదు. నా జీవితం. నా జీవితానికి సరైన న్యాయం కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఇది ఖచ్చితంగా లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. కొన్నేళ్లుగా భరించిన శారీరక, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆర్థికంగా నేను వేధింపులకు గురయ్యాను. నా వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికి నా తల్లిదండ్రులను కలవడానికి కూడా నాకు అనుమతి లేకుండా పోయింది. చివరకు నా బంధం నుంచి బయటపడేందుకు చాలా కష్టమైంది. ఈ విషయాలు చెబుతున్నప్పుడు నాకు చాలా బాధగా ఉంది.. నా జీవితంలో జరిగిన దాని గురించి నా తల్లిదండ్రులతో, నా సన్నిహితులతో బహిరంగంగా మాట్లాడాను. ఈ వైవాహిక జీవితాన్ని నేనే వదిలేయాలని నేను నిర్ణయించుకోలేదు. కానీ ఆ నిర్ణయంవైపు వెళ్లాల్సి వచ్చింది.

నేను మౌనంగా ఉండటం వల్ల చాలా నిందలు ఎదుర్కొంటున్నాను. ఒక తండ్రిగా నా బాధ్యతను నిర్వర్తించడం లేదని వాళ్లు నన్ను నిందిస్తున్నారు. ఈ ఆరోపణలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను ఎప్పుడూ సత్యాన్ని నమ్ముతాను. దీనికి సరైన న్యాయం జరిగే వరకు నేను వేచి ఉంటాను. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే… నా పిల్లలను సానుభూతి కోసం ఉపయోగించుకోవడాన్ని నేను అంగీకరించలేను. నేను నా పిల్లలను ఎప్పుడూ వదులుకోలేదు. నేను వదులుకోను. ఒక తండ్రిగా శారీరకంగా మానసికంగా ఏమి అడిగినా ఎప్పుడు అండగా ఉన్నాను ” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Ravi Mohan (@iam_ravimohan)

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..