Tollywood: నేను సినిమాలు మానేయ్యోచ్చు.. స్టార్ హీరో సంచలన కామెంట్స్.. ఫ్యాన్స్ షాక్..
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమా రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించాడు. నిజానికి తమిల్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా ఈ హీరో చేసిన కామెంట్స్ విని అభిమానులు షాకయ్యారు.

దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక అభిమానులు ఉన్న హీరోలలో అజిత్ ఒకరు. చాలా సంవత్సరాలుగా సినిమాల్లో నటించడం తప్ప.. ప్రజా కార్యక్రమాలు, ఉత్సవాల్లో పాల్గొనడం ఆపేశాడు. కానీ ఇప్పుడు సినిమాలతోపాటు తిరిగి తనకు ఇష్టమైన కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇటీవల దుబాయ్ లో జరిగిన కార్ రేసులో వరుసగా విజయాలను అందుకుంటున్నాడు. అలాగే ఇటీవలే తన కుటుంబంతో కలిసి కేంద్ర ప్రభుత్వం అందించిన పధ్మభూషణ్ అవార్డ్ ప్రధానోత్సవానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవలే పద్మభూషణ్ అవార్డు అందుకున్న తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. తమ అభిమాన హీరో చేసిన కామెంట్స్ విని షాకవుతున్నారు ఫ్యాన్స్.
ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. తాను సినిమాలు మానేయ్యోచ్చు అని అన్నారు. “నేను ఎప్పుడూ పదవీ విరమణ గురించి ఆలోచించలేదు. కానీ నేను సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సి రావచ్చు. నేను యాక్టింగ్ నుంచి ఎప్పుడు వైదొలగుతానో ఎవరికీ తెలియదు. బలవంతంగానైనా సినిమాను వీడాల్సి రావొచ్చు. నేను ఏ విషయాన్ని అంత తేలికగా తీసుకోకూడదనుకుంటున్నాను. ప్రేక్షకులు నా యాక్టింగ్ గురించి ఫిర్యాదు చేస్తారమే తెలియదు కదా.. వారంతా నన్ను ప్రేమిస్తున్నప్పుడే నేను సినిమాల నుంచి తప్పుకుంటానేమో. జీవితం చాలా విలువైనది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నా స్నేహితులు, బంధువులు జీవితంలో చాలా పోరాటాలు చేస్తున్నారు. వారంతా క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్నారు. వారిని చూసినప్పుడు జీవితం గురించి అర్థమవుతుంది. నేను నా జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. సమయాన్ని అసలు నిర్లక్ష్యం చేయను” అంటూ చెప్పుకొచ్చారు.
1990లో ఎన్ వీడు ఎన్ కనవర్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన అజిత్, వీరం, బిల్లా, మంకత్త వంటి అనేక చిత్రాల్లో నటించారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చిత్రాల్లో నటిస్తున్నారు. తాను ఎప్పుడు సినిమాల్లోకి రావాలని అనుకోలేదని..కానీ తన అప్పులు తీర్చడానికి మాత్రమే నటుడిని అయ్యానని అన్నారు.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




