AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: అభిమానులకు హీరో అజిత్ విజ్ఞప్తి.. ఇకపై తనను అలా అని పిలవద్దంటూ..

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళంలోనే కాకుండా..

Ajith Kumar: అభిమానులకు హీరో అజిత్ విజ్ఞప్తి.. ఇకపై తనను అలా అని పిలవద్దంటూ..
Rajitha Chanti
|

Updated on: Dec 01, 2021 | 3:47 PM

Share

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ అజిత్‏కు ఫాలోయింగ్ ఎక్కువే. అజిత్ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నాడు. అయితే అజిత్‏ను ఆయన అభిమానులు తల అని పిలుచుకుంటుంటారు. తాజాగా అజిత్ ఇకపై తనను తల అని పిలవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు.

“గౌరవనీయమైన మీడియా సభ్యులకు, ప్రజానీకానికి, అభిమానులకు. నన్ను ఇక నుంచి అజిత్, అజిత్ కుమార్ లేదా జస్ట్ ఎకె ఎన్ అని పిలవండి. కానీ తల లేదా మరేదైనా పేర్లతో నన్ను పిలవకండి. మీ అందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం, విజయం, మనశ్శాంతి, సంతృప్తితో కూడిన అందమైన జీవితాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రేమతో మీ అజిత్” అంటూ ట్వీట్ చేశారు.

ట్వీట్..

ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన ధీన చిత్రం అజిత్‏ను మాస్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాలోని అజిత్ పాత్ర పేరుతో ఆయన అభిమానులు తల అని పిలవడం ప్రారంభించారు. అజిత్ స్టార్ హీరోగా కాకుండా.. మాములుగా మనిషిగా ప్రజలలో కలిసిపోతుంటారు. అందుకే దక్షిణాది చిత్రపరిశ్రమలో అజిత్‏కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం అజిత్ వాలిమై సినిమా చేస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తుండగా.. హ్యూమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: హౌజ్‌లో మరోసారి రచ్చ చేసిన సన్నీ.. గట్టిగా అరిచి రాద్ధాంతం చేసిన సిరి..

Unstoppable with NBK : బాలయ్య ఈసారి సందడి చేసేది బ్రహ్మానందంతోనే.. బ్రహ్మీతోపాటు ఆయన కూడా..

Radhe Shyam Song: రాధేశ్యామ్‌ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌.. విజువల్స్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే..