AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK : బాలయ్య ఈసారి సందడి చేసేది బ్రహ్మానందంతోనే.. బ్రహ్మీతోపాటు ఆయన కూడా..

100 శాతం తెలుగు కంటెంట్ తో దూసుకుపోతున్న ఒకేఒక్క ఓటీటీ సంస్థ ఆహా. సూపర్ హిట్ సినిమాతో, అదిరిపోయే గేమ్ షోలతో ఆకట్టుకుంటున్న ఆహా

Unstoppable with NBK : బాలయ్య ఈసారి సందడి చేసేది బ్రహ్మానందంతోనే..  బ్రహ్మీతోపాటు ఆయన కూడా..
Aha
Rajeev Rayala
|

Updated on: Dec 01, 2021 | 12:06 PM

Share

Unstoppable with NBK : 100 శాతం తెలుగు కంటెంట్ తో దూసుకుపోతున్న ఒకేఒక్క ఓటీటీ సంస్థ ఆహా. సూపర్ హిట్ సినిమాతో, అదిరిపోయే గేమ్ షోలతో ఆకట్టుకుంటున్న ఆహా , అలరించే టాక్ షోలతోను ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పటికే సమంత తో సామ్ జామ్ అనే టాక్ షో నిర్వహించి సక్సెస్ అయినా ఆహా ఇప్పుడు నటం సింహం బాలకృష్ణ‌తో అన్ స్టాపబుల్ అంటూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని సూపర్ సక్సెస్ అయ్యింది ఈ టాక్ షో. సినిమాతోనే కాదు కబుర్లు చెప్పడంలోనూ బాలయ్య సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ టాక్ షోకు మొదటి గెస్ట్ గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు హాజరయిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, బాలయ్య మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది.

ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా హాజరయ్యారు. నాని తో బాలయ్య చేసిన అల్లరి అంతా ఇంత కాదు. నాని తో మాటలేకాదు ఆటలు కూడా ఆడించారు బాలయ్య. ఇక ఇప్పుడు బాలయ్య షోకు గెస్ట్ గా రాబోయేది ఎవరంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముచ్చటగా మూడో ఎపిసోడ్ కు ఎవరు గెస్ట్ గా రానున్నారంటూ అంతా ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు. తాజాగా మూడో గెస్ట్ ఎవరో చెప్పేసారు అన్ స్టాపబుల్ నిర్వాహకులు. ఈసారి బాలయ్య టాక్ షోకు గెస్ట్ గా నవ్వుల రారాజు బ్రహ్మానందం హాజరుకాన్నారు. ఆయనతో పాటు సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఈ ఎపిసోడ్ లో సందడి చెయ్యనున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చేతికి సర్జరీ కావడంతో బాలయ్య చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు డబుల్ ఎనర్జీతో తిరిగి సందడి చేయనున్నారు.

View this post on Instagram

A post shared by ahavideoIN (@ahavideoin)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sirivennela Seetharama Sastry: ‘మీరు కన్ను మూస్తే.. మాకు ఈ ప్రపంచం చీకటయ్యింది…’

Sirivennela Seetharama Sastry: ఆయన సంతకం కోసం ప్రయత్నించా కానీ చివరకు.. భావోద్వేగానికి గురైన రాజమౌళి..

Sirivennela: సాహితీ లోకానికి సిరివెన్నెల మిగిల్చిన చివరి గుర్తులు ఇవే.. సీతరామశాస్త్రి రాసిన చివరి పాట ఏంటో తెలుసా.?