Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sirivennela Seetharama Sastry: ఆయన సంతకం కోసం ప్రయత్నించా కానీ చివరకు.. భావోద్వేగానికి గురైన రాజమౌళి..

సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణ వార్తను సినీలోకం జీర్ణించుకోలేకపోతున్నారు. బరువెక్కిన గుండెతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Sirivennela Seetharama Sastry: ఆయన సంతకం కోసం ప్రయత్నించా కానీ చివరకు.. భావోద్వేగానికి గురైన రాజమౌళి..
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 01, 2021 | 11:14 AM

Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణ వార్తను సినీలోకం జీర్ణించుకోలేకపోతున్నారు. బరువెక్కిన గుండెతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అనారోగ్యంతో సిరివెన్నెల కన్ను మూసిన విషయం తెలిసిందే.. కొద్దిసేపటి క్రితమే ఆయన పార్థివదేహం అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్‌లో ఉంచారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, త్రివిక్రమ్, క్రిష్ ఆయన పార్ధివదేహాన్ని సందర్శించారు. ఇక రాజమౌళి సోషల్ మీడియా వేదికగా సిరివెన్నెలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..

1996 లో మేము అర్ధాంగి అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి. అలాంటి పరిస్థితులలో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్ను తట్టి ముందుకు నడిపించినవి ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులు కోవద్దురా ఓరిమి అన్న సీతారామశాస్త్రి గారి పదాలు… భయం వేసినప్పుడల్లా గుర్తు తెచ్చుకుని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది అన్నారు రాజమౌళి.

అప్పటికి నాకు శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువ. మద్రాసులో డిసెంబర్ 31 వ తారీకు రాత్రి 10 గంటలకి ఆయన ఇంటికి వెళ్ళాను. ఏం కావాలి నందీ’ అని అడిగారు. ఒక కొత్త నోట్ బుక్ ఆయన చేతుల్లో పెట్టి మీ చేతుల్తో ఆ పాట రాసివ్వమని అడిగాను…. రాసి, ఆయన సంతకం చేసి ఇచ్చారు…. జనవరి 1 న మా నాన్న గారికి గిఫ్ట్ గా ఇచ్చాను. నాన్న గారి కళ్ళల్లో ఆనందం, మాటల్లో కొత్తగా ఎగదన్ను కొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను…

సింహాద్రి లో “అమ్మయినా నాన్నయినా లేకుంటే ఎవరైనా పాట మర్యాద రామన్న లో “పరుగులు తీయ్’ పాట, ఆయనకి చాలా ఇష్టం….  అమ్మ నాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవటం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము..? నందీ అని తిట్టి, మళ్ళీ ఆయనే ” ఈ ఛాలెంజ్ నాకు నచ్చింది ” అంటూ మొదలు పెట్టారు. కలిసినప్పుడల్లా ప్రతీ లైన్ నెమరువేసుకుంటూ, అర్ధాన్ని మళ్ళీ విపులీకరించి చెప్తూ, ఆయన స్టైల్ లో గది దద్దరిల్లేలా నవ్వుతూ, పక్కనే ఉంటే వీపుని గట్టిగా చరుస్తూ ఆనందించేవారు….ఆర్ఆర్ఆర్ సినిమాలో దోస్తే వీడియోకి అలాగే లిరికల్ పేపర్ లో ఆయన సంతకం చేస్తే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించాము. కానీ అప్పటి ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. నా జీవన గమనానికి దిశా నిర్దేశం చేసిన శాస్త్రి గారి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. రాజమౌళి”  అంటూ భావిద్వేగా లేఖను షేర్ చేశారు రాజమౌళి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sirivennela: సాహితీ లోకానికి సిరివెన్నెల మిగిల్చిన చివరి గుర్తులు ఇవే.. సీతరామశాస్త్రి రాసిన చివరి పాట ఏంటో తెలుసా.?

Y. V. S. Chowdary: సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు సిరివెన్నెల.. ఎమోషనల్ అయిన వైవిఎస్ చౌదరి..

Sirivennela: సిరివెన్నెల తెలుగు సినీ కవి కావడం ఆయన దురదృష్టం.. తెలుగు వారి అదృష్టం.. వైరల్‌ అవుతోన్న త్రివిక్రమ్‌ పాత స్పీచ్‌.