Sirivennela Seetharama Sastry: సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు సిరివెన్నెల.. ఎమోషనల్ అయిన వైవిఎస్ చౌదరి..

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. తెలుగు కళమ్మతల్లి ఓ కవి పుంగవుడిని కోల్పోయింది.

Sirivennela Seetharama Sastry: సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు సిరివెన్నెల.. ఎమోషనల్ అయిన వైవిఎస్ చౌదరి..
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 01, 2021 | 8:01 AM

Sirivennela Seetharama Sastry: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. తెలుగు కళమ్మతల్లి ఓ కవి పుంగవుడిని కోల్పోయింది. అనారోగ్యంతో సిరివెన్నెల కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంగీత ప్రేమికులు సిరివెన్నెల లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సిరివెన్నెల మరణం పై దర్శకుడు వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను చదువుకున్న అనంతమైన సాహిత్యపు సారాన్ని మరియూ జీవితం పట్ల తనకున్న అపారమైన అవగాహనని మేళవించి.. రాసే ప్రతిపదం వెనుక ఎంతో గాఢమైన, లోతైన సారాన్ని, జ్ఞానాన్ని సందర్భోచితంగా నింపుతూ.. ప్రతి పాటని ఒక తపస్సులా, తన సొంత బిడ్డలా భావిస్తూ.. పండితులను పామరులను ఏకకాలంలో ఆకట్టుకుని కట్టిపడేసే ఒక సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు (Lyrical Scientist) అయిన ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గారు అకాల మరణం చెందటం.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టం అన్నారు. ఆయనతో, ఆయన బిడ్డలతో (పాటలతో) మరియూ ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయ పరిచయం కలగటం నేను చేసుకున్న అదృష్టం అన్నారు వైవిఎస్. నా దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘సీతారామరాజు’ మరియూ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలలోని అన్ని పాటలను ఆయనతో రాయించుకోగలిగిన అనుభవాన్ని పొందగలగటం.. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన పాటల రూపంలో తెలుగు సాహిత్య ప్రియుల మధ్య ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారని విశ్వసిస్తూ.. అంటూ భావోద్వేగానికి గురయ్యారు వైవిఎస్ చౌదరి .

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని ఎంతో విచారించానని ఆయన తెలిపారు. నలుగురి నోటా పది కాలాల పాటు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సిరివెన్నెల సుసంపన్నం చేశారని కొనియాడారు. తెలుగు సినీ గీతాల్లో సాహిత్యం పాళ్లు తగ్గుతున్న తరుణంలో వచ్చిన సీతారామశాస్త్రి… పాటకు ఊపిరిలూదారని సీజేఐ ప్రశంసించారు. సాహితీ విరించి సీతారామశాస్త్రి గారికి శ్రద్ధాంజలి అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నారు. నేడు 11 గంటలకు పోలీస్ లాంఛనాలతో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నివాళులు అర్పించనున్నారు.. తదనంతరం మహాప్రస్థానానికి తరలింపు..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sirivennela Sitarama Sastri: సాహిత్య లోకానికి చీకటి రోజు.. తీవ్ర భావోద్వేగానికి గురైన చిరంజీవి..

Sirivennela Seetharama Sastri: ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు.. 2020-21లో మరణించిన సినీ ప్రముఖులు వీళ్లే..

Jacqueline Fernandez: సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఏం చేసిందో తెలుసా..

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?