Tamannaah: బుధవారం హైదరాబాద్‌కు మిల్కీ బ్యూటీ.. ఆ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సందడి చేయనున్న తమన్నా..
జైలర్ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జైలర్ ఆగస్టు 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బుధవారం (జులై 26) హైదరాబాద్‌కు రానుంది. తన లేటెస్ట్ సినిమా జైలర్ సినిమా సాంగ్ రిలీజ్ కోసం ఆమె సీఎంఆర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీకి వస్తోంది. కాగా రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ నుంచి కావాలా సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పుడీ సెన్సేషనల్ సాంగ్ తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయనున్నారు. బుధవారం హైదరాబాద్ లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా తమన్నా ఈ సాంగ్‌ను లాంఛ్ చేయనుంది, ఈమేరకు సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది జైలర్ మూవీ యూనిట్. మధ్యాహ్నం 3 గంటలకు సాంగ్ లాంఛ్ ఈవెంట్ జరగనుంది. కాగా జైలర్ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జైలర్ ఆగస్టు 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
జైలర్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.అలాగే నాగేంద్రబాబు, సునీల్, రమ్యకృష్ణ, యోగిబాబు లాంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ టాక్ కూడా వచ్చింది. జైలర్ మూవి నిడివి సుమారు రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలని తెలుస్తోంది. కాగా జైలర్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది తమన్నా. జైలర్ రిలీజైన మరుసటి రోజే ఈ సినిమా కూడా విడుదల కానుండడం గమనార్హం. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Hyderabad! @tamannaahspeaks is all set to launch #Kaavaali on July 26th 🥳 💃🏻
Telugu version of #Kaavaalaa is on the way!😎@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @suneeltollywood @sindhujas13 @AsianCinemas_ #Jailer pic.twitter.com/3yh9f5v7Sh
— Sun Pictures (@sunpictures) July 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..